»   » రామ్ చరణ్ హీరోయిన్ తో వరుణ్ తేజ

రామ్ చరణ్ హీరోయిన్ తో వరుణ్ తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా క్యాంప్ లోకి ఒక హీరోయిన్ ప్రవేశించిందంటే అక్కడ హీరోలందరితో ఆమె సినిమాలు చేయటం జరగుతూంటుందని గతంలో చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నట్లుంది. రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేసిన ఆమె, ఇప్పుడు అల్లు అర్జున్ తో సరైనోడు చేస్తోంది. ఈ రెండు కాకుండా త్వరలో వరుణ్ తేజ సరసన కూడా కమిట్ అవుతోందని సమాచారం.

ఎన్టీఆర్ తో ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాలో నటించిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఏ సినిమా కమిట్ కాలేదు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకు సంబందించి రకుల్ పార్ట్ మెత్తం పూర్తయింది. ఇంచుమించుగా అల్లుఅర్జున్ హీరోగా రూపోందుతున్న సరైనోడు సినిమాలో కూడా తన రోల్ పూర్తి కావస్తోంది. దాంతో ఆమె నెక్ట్స్ ప్రాజెక్టు కమిటవటానికి చూస్తోంది.

Rakul Preet Singh to act with Varun Tej?

అందుతున్న సమాచారం ప్రకారం..ఆమెను వరుణ్ తేజ సరసన అడిగారు. అయితే వరుణ్ తేజ కమిటైన ఏ సినిమాకు అనేది తెలియలేదు. వరుణ్ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అందులో ఒకటి గోపిచంద్ మలినేని డైరక్షన్ లోకాగా, మరోకటి క్రిష దర్శకత్వంలో. మరి ఈ రకుల్ ఏ సినిమా చేస్తుందో చూడాలి.

Read more about: rakul preet singh, varun tej
English summary
Varun Tej has signed two movies - one with director Gopichand Malineni, the other with director Krish.
Please Wait while comments are loading...