twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని-విక్రమ్ కుమార్ మూవీలో రకుల్ ఐటం సాంగ్?

    |

    నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమవ్వడంతో పాటు షూటింగ్ కూడా మొదలైంది.

    ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తుండగా... దాన్ని మించిన హాట్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించాలని రకుల్ ప్రీత్ సింగ్‌ను నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఆమె దీనికి అంగీకరిస్తుందో? లేదో? చూడాలి.

    Rakul Preet Singh

    నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌ ఫ్లై) కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

    English summary
    Natural Star Nani, Versatile Director Vikram K. Kumar's film Produced by Naveen Yerneni, Y.Ravishankar, C.V.Mohan (CVM) in Mythri Movie Makers as Production No 8 launched today (Feb 18) at 10:49 am with Pooja ceremony. Meanwhile, the latest we hear is that the makers have approached star heroine Rakul Preet Singh for a special song in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X