Rakul Preet Singh: ప్రియుడినే పెళ్లాడబోతున్న రకుల్.. ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
2023లో చాలా మంది యంగ్ హీరోహీరోయిన్లు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టి ఓ ఇంటి వాళ్లు అయిపోయారు. మరెంతో మంది పిల్లలకు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే 2024లోనూ అదే హవా కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది కూడా చాలా మంది స్టార్ హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు అర్థం అవుతుంది. 2024లోకి ఇలా అడుగు పెట్టామో లేదో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గొ కొనసాగుతున్న రకుల్ ప్రీత్ తన ప్రియుడితోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది తొలి పెళ్లి వీరిదే కాబోతుందా మరెవరిదైనా, అసలు ఈ బ్యూటీ ఎక్కడ, ఎలా పెళ్లి చేసుకోబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కెరటం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు సినీ రంగానికి సంబంధించిన పెద్ద పెద్ద హీరోల అందరి పక్కన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. అయితే కరోనా సమయంలో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిందీ క్యూట్ బ్యూటీ.

కరోనా సమయంలో తాము దగ్గరయ్యామని.. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపామని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల క్రితం తన ప్రేమ విషయం బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అందుకు సంబంధించిన ఏ విషయాల గురించి పెద్దగా చర్చించలేదు. ఇది చూసిన చాలా మంది వీరిద్దరూ విడిపోయినట్లు భావించారు. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ వీరు మరోసారి మీడియా ముందు ప్రత్యక్ష్యం అయ్యారు. ఇక అప్పటి నుంచి వీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఈ ఏడాది మొదటి సెలబ్రిటీ పెళ్లి ఇదే అవుతుందని తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో ఇప్పటికైతే తెలియదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











