ఇదేం ట్విస్ట్ :రవితేజ కు నో చెప్పింది
హైదరాబాద్ : వరస విజయాలతో దూసుకుపోతున్న భామ రకుల్ ప్రీతి సింగ్. ఆమెను తమ ప్రక్కన హీరోయిన్ గా పెట్టుకోవాలని ఆ లక్ తమకూ అంటించాలని హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రవితేజ సరసన ఆమెను కిక్ 2 చిత్రం కోసం అడిగినట్లు సమాచారం. అయితే డేట్స్ ఖాళీ లేవని ఆమె తిరస్కరించిందని సమాచారం. దాంతో ఇప్పుడు దర్శక,నిర్మాతలు మరో హీరోయిన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ టు ముంబై, ముంబై టు సిమ్లా, సిమ్లా టు హైదరాబాద్ ఇలా బిజీగా తిరుగుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఇచ్చిన కిక్‌తో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరడజను సినిమాలతో తిరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు హిందీ సినిమా హడావుడిలో ఉంది. అందుకోసం హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్ పదే పదే తిరిగాల్సి వస్తోంది. మధ్యలో సిమ్లాలో హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇక రఫ్, కరెంట్ తీగ వంటి చిత్రాల ప్రమోషన్లలో పాలు పంచుకుంటోంది. దీంతో రకుల్ ఇప్పుడు యమ బిజీ బ్యూటీ అయిపోయింది.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2' చిత్రానికి దర్శకత్వం సురేందర్ రెడ్డి. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్, ఎన్టీఆర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, నిర్మాత భోగవల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











