BRO: పవన్‌కు హ్యాండిచ్చిన రకుల్.. చివరి నిమిషంలో అలా చెప్పడంతో!
రాజకీయాల కోసం చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ లోటును భర్తీ చేసేందుకు రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పటికే కొన్నింటితో ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇలా ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'బ్రో (BRO)' ఒకటి. ఇందులో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తోన్నాడు. ఈ మెగా మల్టీస్టారర్ మూవీని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు.
తమిళంలో రూపొంది ఓటీటీలో నేరుగా విడుదలై.. మంచి స్పందనను సొంతం చేసుకున్న 'వినోదయ సీతమ్' సినిమాకు 'బ్రో (BRO)' రీమేక్‌గా వస్తుంది. దీన్ని ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను గత ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. ఆ వెంటనే చాలా వరకు షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని రోజులు షూట్ ప్లాన్ చేశారు. అది అలా ఉండగానే తాజాగా డబ్బింగ్ పనులను కూడా చిత్ర యూనిట్ మొదలెట్టేసింది.

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బ్రో (BRO)' మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఈ పాటలో ఏ హీరోయిన్‌ను తీసుకుంటారు అన్న దానిపై మాత్రం ఎన్నో రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేసేసిందట. ఆమెపై ఈ పాటను జూన్ 5వ తేదీ నుంచి చిత్రీకరించాలని ప్లాన్ చేశారట. కానీ, ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని రకుల్ దీని నుంచి తప్పుకున్నట్లు తాజాగా తెలిసింది. ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తోన్న 'బ్రో (BRO)' చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











