తెలుగింటి కోడలు కాకూడదా? రకుల్.. సమంత దారిలోనే పంజాబీ బ్యూటీ
Recommended Video

టాలీవుడ్‌లో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోని హ్యాపీగా ఉన్నారు. వారి దారిలోనే మరికొందరు టాలీవుడ్ హీరోలు నడువడానికి సిద్దపడుతున్నారనే వార్తలు ఇటీవల కాలంలో బాగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్యలో సాయి ధరమ్ తేజ్, రెజీనా పెళ్లి వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమన్నాయి. ఆ తర్వాత పెద్దగా పసలేకపోవడంతో ఆ వార్తలు చప్పుమన్నాయి. తాజాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుదన్నదనే నిరాధారమైన వార్త తెలుగు మీడియాలో గుప్పుమంటున్నది.

పెళ్లి వార్తలపై రకుల్
ఏ విషయంపైనైనా రకుల్ ప్రీత్ సింగ్ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దాటేయ్యకపోవడం ఆమె ఉన్న మంచి లక్షణాల్లో ఒకటి. హీరోయిన్గా ప్రస్తుతం టాప్ రేపుతున్న బ్యూటీ ఇప్పుడే పెళ్లి చేసుకునేది లేదు అని పలు సందర్భాల్లో చెప్పింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో మీడియాతో షేర్ చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి.

తెలుగింటి కోడలు కావొద్దా?
తనకు కాబోయే భర్త కనీసం ఆరడుగుల ఎత్తు ఉండాలని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. తాగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను తెలుగింటి కోడలు కావొద్దా అని చెప్పిన మాటలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. అంటే తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం అనేక సందేహాలకు తెరలేపాయి.

సమంతలాగే రకుల్
తెలుగింటి కోడలు కావడానికి నేను రెడీగా ఉన్నానని ఈమె సంకేతాలు ఇవ్వడం విశేషం. సమంతలాగే రకుల్ కూడా తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అయితే రకుల్ పెళ్లి చేసుకొనేది సినీ పరిశ్రమకు చెందిన వాడినా లేక బయట వ్యక్తినా అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో అది గాసిప్‌గానే మారింది.

దూసుకెళ్తున్న రకుల్
అటు మహేశ్‌బాబు లాంటి సీనియర్ హీరోలతోనూ, ఇటు బెల్లంకొండ శ్రీను లాంటి యువ హీరోలతో జతకడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సొంతం ఇంటి కలను సాకారం చేసుకొన్నారు. హైదరాబాద్ తనకు హోం ప్లేస్ లాంటిదని చెప్పారు. తాజాగా ఖాకీ చిత్రంతో రకుల్ మరో సక్సెస్‌ను సొంతం చేసుకొన్నారు.

రకుల్ ఫిటినెస్ బిజినెస్
అటు యాక్టింగ్‌తోపాటు హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ సెంటర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తన వ్యాపారానికి వైజాగ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే ఏర్పాట్లలో రకుల్ ఉన్నారు.

నీరజ్ పాండేతో హిందీ సినిమా
ప్రస్తుతం హిందీలో నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న యే యారీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఖాకీ చిత్రం తర్వాత తమిళంలో కార్తీతో మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహేశ్‌బాబుతో మరో చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











