సెన్సేషనల్ డైరెక్టర్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. మీడియాలో రూమర్లు వైరల్
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ టాప్ గేర్‌లో దూసుకెళ్లున్నది. లాక్‌డౌన్ తర్వాత చేతి నిండా తెలుగు, హిందీ సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా మారిపోయింది. అయితే తాజాగా సౌత్‌లో భారీ బడ్జెట్, అగ్ర దర్శకుడు, హీరో కాంబినేషన్‌లో వచ్చే మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసిందనే వార్త వైరల్‌గా మారింది. ఆ మూవీ వివరాల్లోకి వెళితే.

బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలో జోరు
లాక్‌డౌన్ కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ పక్కాగా తన కెరీర్‌పై దృష్టిపెట్టింది. బాలీవుడ్‌లో యువ హీరోలు, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో దాదాపు అర డజన్‌కుపైగా సినిమాలు ఉండటం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

ఇండియన్ 2 చిత్రంలో
ఇక సౌత్ మూవీస్ విషయానికి వస్తే.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2లో కీలక పాత్రలను పోషించడానికి సిద్ధమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఇండియన్ 2 ప్రాజెక్టు ఆలస్యమైంది. దాంతో కమల్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది.

శంకర్, రాంచరణ్ చిత్రంలో
అయితే హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. దక్షిణాది చిత్రసీమపై పట్టు ఇంకా వదల్లేదు. శంకర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో రకుల్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. భారీ బడ్జెట్, సౌత్‌లోని అగ్ర నటీనటులతో రూపొందే ఈ చిత్రంలో రకుల్ ఎంపిక చేసినట్టు వార్త వినిపిస్తున్నది.

అఫీషియల్‌గా క్లారిటీ
డైరెక్టర్ శంకర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో రకుల్ నటిస్తుందనే విషయం మీడియాలో మాత్రం వైరల్ అయింది. అయితే అధికారికంగా యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో రకుల్ గానీ, సినిమా యూనిట్ గానీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం ఏమిటో బోధపడదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే..
బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పలు ప్రాజెక్టులతో బిజీగా మారిపొయింది. జాన్ అబ్రహంతో కలిసి ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సర్దార్ కా గ్రాండ్ సన్, ఆయాలాన్, మేడే, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో డీ గ్లామరైజ్డ్ పాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











