Ramayan: శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రామాయణంలో అస్సలు ఊహించని ట్విస్ట్!

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో 'రామాయణ’ (Ramayan)ఒకటి. దర్శకుడు నితేష్ తివారీ రూపొందించిన ఈ మైథలాజికల్ ఎపిక్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ గాథను ఆధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ప్రదర్శించడానికి మేకర్స్ భారీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో మంచి చర్చకు దారితీస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమా క్యాస్టింగ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో ఈ రావణాసురుడి సోదరి శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ గా నటించబోతుందట. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?

దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari) రూపొందించిన ఈ మైథలాజికల్ ఎపిక్‌ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనుంది. రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తుండగా, ఆయన ఈ సినిమాకి సహ నిర్మాతగానూ నటించారు. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా లారా దత్తా కైకేయిగా, ఇందిరా కృష్ణన్ కౌసల్యగా కనిపించనున్నారు.

Rakul Preet Singh to Play Surpanakha in Nitesh Tiwari s Ramayana Buzz Goes Viral

ఈ భారీ క్రిస్మస్ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, DNEG సంస్థలు సంయుక్తంగా ఉన్నాయి. వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా సాయి పల్లవి, యశ్, హనుమంతుడి పాత్రలను చూపించకపోవడం కొంతమందిని నిరాశపరిచింది. కానీ రణ్‌బీర్ కపూర్‌ను రాముడిగా చూపించిన తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాలో ఈ రావణాసురుడి సోదరి శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ గా నటించబోతుందట. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించి బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా గ్లామర్ పాత్రల్లో కనిపించే రకుల్.. ఇప్పుడు రామాయణంలో కీలకమైన నెగెటివ్ షేడ్ పాత్రకు ఎంపిక కావడం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా శూర్పణఖ పాత్ర రామాయణ కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర కావడంతో.. రకుల్ ఎంపికపై ఆసక్తి పెరిగింది.

పౌరాణిక కథ ప్రకారం అడవిలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ ప్రేమలో పడుతుంది. అనంతరం లక్ష్మణుడు ఆమె ముక్కు కోయడం.. ఆ అవమానంతో రావణాసురుడి వద్దకు వెళ్లి సీత గురించి చెప్పడం.. ఆ తర్వాత రావణుడు సీతను అపహరించడం వంటి సంఘటనలతో రామాయణ యుద్ధానికి బీజం పడుతుంది. అందుకే ఈ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యత ఉంది. నిడివి తక్కువైనా, నటనకు విపరీతమైన స్కోప్ ఉండటంతో రకుల్ ఈ పాత్రను అంగీకరించినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురు నటీమణులతో టెస్ట్ షూట్స్ చేసిన దర్శకుడు నితీశ్ తివారి.. చివరకు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేసి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X