'గబ్బర్ సింగ్ 2' లో హీరోయిన్ గా ఆమెనే ఫైనల్
హైదరాబాద్: ఉంటుదా..ఉండదా అనే అనేక సందేహాలకు సమాధానంగా ఎట్టకేలకు పవన్ తన ప్రెస్టేజియస్ ప్రాజెక్టు గబ్బర్ సింగ్ 2 ని పట్టాలు ఎక్కించటానికి నిర్ణయించుకున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు సిద్దం అవనుంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రంలో పవన్ ప్రక్కన చేసే హీరోయిన్ ఎంపిక పూర్తైందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆమె మరెవరో కాదు తన తొలి చిత్రంతోనే యూత్ ని ఆకట్టుకున్న రకుల్ ప్రీతి సింగ్. ఆమెకు పవన్ ప్రక్కన చేయాలనేది జీవితాశయంట. అది అతి త్వరలోనే నెరవేరబోతోందని తెలుస్తోంది. సంపత్ నంది ఈ మేరకు ప్రపోజల్ ని పవన్ కి పెట్టినట్లు తెలుస్తోంది. పవన్ కూడా ఓకే చేస్తారని చెప్పుకుంటున్నారు.
'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

సంపత్ నంది మాట్లాడుతూ... ''గబ్బర్ సింగ్ సీక్వెల్ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు. ఇక ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
'రచ్చ'తో ఆకట్టుకున్న సంపత్.. ఆ తరవాత చేస్తున్న చిత్రమిదే. శరత్ మరార్ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.


Click it and Unblock the Notifications











