Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ ‘బ్రహ్మోత్సవం’లోనూ ఆమెనే?
హైదరాబాద్: మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషనల్‌లో వచ్చిన ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘‘ బ్రహ్మోత్సవం '' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అనతికాలంలో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటుంది. ‘కిక్ 2′, ‘పండగ చేస్కో' సినిమాలలో నటిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త సినిమాలలో ఆమె హీరోయిన్. అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లుకీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.

తొలినుంచీ శ్రీకాంత్ అడ్డాల చిత్రాల్లో వీరికి కీ రోల్స్ ఉంటూ వస్తున్నాయి. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా చిత్రాల్లో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు గుర్తుండి పోయే పాత్రలు చేసారు. అలాగే ఈ బ్రహ్మోత్సవం చిత్రంలోనూ వీరికి ప్రత్యేకమైన పాత్రలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్... పివిపి బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఈ సినిమాకి ‘బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో తెలుస్తాయి.
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే మహేష్ బాబు - పూర్ణలపై వచ్చే ఓ సాంగ్ ని షూట్ చేసారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు తన సినిమా శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.