»   » హిట్ ఇచ్చిన డైరక్టర్ ని వదిలేటట్లులేడు

హిట్ ఇచ్చిన డైరక్టర్ ని వదిలేటట్లులేడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒకసారి తమతో హిట్ కొట్టిన డైరక్టర్ తో పనిచేయటం హీరోలకు ఎప్పుడూ హ్యాపీనే. అంతేకాదు బిజినెస్ పరంగానూ అది ఎప్పుడూ మంచి స్ట్రాటజీనే. రీసెంట్ గా "నేను...శైలజ" అంటూ ఫామ్ లోకి వచ్చిన రామ్ ...తన తదుపరి చిత్రానికి సైతం కిషోర్ తిరుమల నే దర్శకుడుగా ఎంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే కిషోర్ తిరుమల చెప్పిన లైన్ బాగా నచ్చిన రామ్ వెంటనే అడ్వాన్స్ ఇప్పించాడని అంటున్నారు.

Ram again with Nenu..Shailaja director

ఈ కొత్త చిత్రంతో రామ్ సోదరుడు కృష్ణ చైతన్య నిర్మాతగా మారనున్నాడని తెలుస్తోంది. ఇన్నాళ్లూ తన సోదరుడు నటించే తమ బ్యానర్ చిత్రాలకు ప్రొడక్షన్ భాధ్యతలు వహిస్తూ వస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి బ్యానర్ పై నిర్మించనున్నారు. నేను శైలజ హిట్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.


ఇక ఈ కొత్త చిత్రం సైతం ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నడవనుందని అంటున్నారు. ఈ దర్శకుడు సైతం తను సెకండ్ హ్యాండ్ చిత్రంతో ఫ్లాఫ్ లో ఉన్నప్పుడు పిలిచి డైరక్టర్ గా అవకాసం ఇచ్చిన బ్యానర్ కు ఈ విధంగా తన కృతజ్ఞతను తీర్చుకోవాలనుకుంటున్నారు. నేను శైలజ చిత్రానికి డైలాగులు వెన్ను దన్నుగా నిలిచాయి. అదే విధంగా తన కొత్త చిత్రానికి సైతం అదే స్దాయిలో వర్క్ చేసి మొదలెట్టమని రామ్ చెప్పారని అంటున్నారు.

English summary
Hero Ram is planning to do another film with "Nenu..Shailaja"director. .
Please Wait while comments are loading...