అసోషియేషన్‌లో బెల్లంకొండపై రామ్ కంప్లైంట్
రామ్, బెల్లంకొండ సురేష్ ల కాంబినేషన్ లో వచ్చిన కందిరీగ చిత్రం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది. రామ్ తనకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ని మూవీ ఆర్టిస్టు అశోసియేషన్ కి కంప్లైంట్ చేసి మరీ వసూలు చేసుకున్నాడనే మ్యాటర్. రామ్ కి ఇవ్వాల్సిన రెమ్యునేషన్ లో కోటి రూపాయలు బెల్లంకొండ సురేష్ ఎగ్గొట్టటానికి ట్రై చేయటం, అది గమనించిన రామ్ వెంటనే అశోషియేషన్ కలవటం జరిగిపోయాయి. రిలీజ్ కు అడ్డువస్తుందని అర్దం చేసుకున్న బెల్లంకొండ వెంటనే ఆ మ్యాటర్ ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేసుకున్నారు.
ఇప్పుడు అంతా హ్యాపీగా హిట్ టాక్ వచ్చాక ఎవరికి వారు తమ వెర్షన్ లో ఈ విషయాన్ని చెప్పుకుంటున్నారు. దాంతో బెల్లంకొండ పద్దతికి విసిగిన రామ్ ఆయన తదుపరి చిత్రంలో చేయనని చెప్పేసారు. రెండు చిత్రాలు కలిపి చేస్తాననే కదా రెమ్యునేషన్ మాట్లాడుకుందని బెల్లంకొండ చెప్తున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇలాంటివి కొత్త కాకపోయినా ఇలా వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు ఇలాంటి ట్విస్టులు ఎదరవ్వటం అరుదు. రామ్ పెదనాన్న పెద్ద నిర్మాత అయిన స్రవంతి రవికిషోర్ మాత్రం ఈ విషయంలో తలదూర్చలేదని, రామ్ నే స్వయంగా సమస్యను సాల్వ్ చేసుకోమని సూచించారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











