twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ను ఫాలోఅవుతున్న రామ్!

    By Sindhu
    |

    'ఖుషి" సినిమా కోసం పవన్ కళ్యాణ్ చేసిన కత్తి ఫైటింగ్ అందరికీ గుర్తుండే వుంటుంది. అప్పట్లో పవన్ ప్రదర్శించిన ఆ కత్తి ఫైటింగ్ కి భలే క్రేజ్ నెలకొంది యూత్ లో. తర్వాత 'జల్సా" ఈ చిత్రంలోనూ కత్తిపట్టి మళ్లీ అలాంటి విన్యాసమే చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి విన్యాసం వెండితెరపై మనం చూడలేదనే చెప్పాలి. అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర". ఈ చిత్రంలో రామ్ చరణ్, 100 మంది తో చేసిన కత్తి యుద్దం ఆ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.

    తాజాగా, పవన్ రూట్ లోనే ఆ కత్తి ఫైటింగుని మరోమారు తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించనున్నాడట రామ్. తన తాజా చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ" సినిమా కోసం రామ్ ఈ యుద్ద విద్యను నేర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రోమోస్ లో కత్తి తిప్పడాన్ని చూపిస్తున్నప్పటికీ, సినిమాలో రామ్ ఎంతవరకు ఆ యుద్ద విద్యను పెర్ పెక్ట్ గా ప్రదర్శిస్తాడనేది వేచి చూడాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X