సినిమా ఫట్ మన్నందుకు పందెం కాసి మీసం తీసిన యంగ్ హీరో...
హీరోగా ఫోజు కొట్టాలంటే మీసం మెలేయాలి. ఆ మీసమే లేకపోతే..వేరే షూటింగ్ కోసం తీసేశాను అని చెప్పాలి. అదీ కాదంటే ఏదో పందెం కాసి ఓడిపోయాడని అర్థం చేసుకోవాలి. అలాంటిదే హీరో 'రామ్" విషయంలో జరిగింది. ఇటీవల ఓ ఫంక్షన్ లో మీసాన్ని నున్నగా గీయించుకున్న రామ్ కన్పించాడు. అలా ఎందుకు మారాడా..? అని ఆరా తీస్తే...తను హీరోగా నటించిన చిత్రం 'రామరామ కృష్ణకృష్ణ" సెంటిమెంట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని స్నేహితుల వద్ద బెట్ కట్టాడట.
లక్ష్యం సినిమా చూసినపుడు దర్శకుడు దగ్గర చాలా విషయం వుందనిపించింది. రామరామ కృష్ణకృష్ణ చూసాక దర్శకుడి దగ్గర చాలా విషయం వుంది కాని, దానిని ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనిపించింది. అంతే ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో రామ్ మీసం తీయించుకోక తప్పలేదు. ఇంకా నయం గుండు చేయించుకుంటానని శపథం చేయలేదు. అలా చేసినట్లయితే మనం రామ్ ను గుండులో చూడాల్సి వచ్చేది. అన్నట్లు ఈ సినిమా కొన్నిచోట్ల బాగా ఊపందుకోవడంతో దిల్ రాజ్ సేఫ్ అయ్యారు.


Click it and Unblock the Notifications











