ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీ స్టారర్..... బడ్జెట్ ఎస్టిమేషన్స్ తయారు చేసిన రాజమౌళి!

By Bojja Kumar

బాహుబలి ప్రాజుక్టుతో దేశం గర్వపడే భారీ సినిమా చేసి ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాకు ఎవరూ ఊహించని కాంబినేషన్ సెట్ చేశాడు. టాలీవుడ్ చిత్ర సీమలో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న రామ్ చరణ్, జూ ఎన్టీఆర్‌లతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రాజమౌళి స్టైల్

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రాజమౌళి స్టైల్

అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేయడం రాజమౌళి స్టైల్. బాహుబలి ప్రాజెక్టు మొదలైన కొత్తలో ఇంత బడ్జెట్ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి వర్కౌట్ కాదు అని చాలా మంది కామెంట్ చేశారు. కానీ వర్కౌట్ అవుతుందని నిరూపించాడు రాజమౌళి. తాజాగా టాలీవుడ్లో అసాధ్యం అనుకున్న ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ కూడా అలానే సెట్ చేశాడు.

 పెద్ద స్టార్లతో మల్టీ స్టారర్ అంటే బడ్జెట్ భారీగా

పెద్ద స్టార్లతో మల్టీ స్టారర్ అంటే బడ్జెట్ భారీగా

ఇద్దరు పెద్ద స్టార్లతో మల్టీ స్టారర్ మూవీ అంటే బడ్జెట్ భారీగా ఉండాల్సిందే. దానికి రాజమౌళి లాంటి దర్శకుడు తోడైతే..... నిర్మాత పెట్టే ఖర్చులో అత్యధిక భాగం రెమ్యూనరేషన్లకే వెళ్లిపోతుంది. అందుకే రాజమౌళి తీస్తున్న మల్టీ స్టారర్ మూవీకి కూడా భారీగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నారట.

Recommended Video

రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ తెలిస్తే షాకే..!
 బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత?

బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత?

సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందనే విషయంలో దర్శకుడు రామజౌళి ఇటీవలే రఫ్ ఎస్టిమేషన్స్ తయారు చేశాడని..... దాదాపు రూ. 90 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ఖర్చు అవ్వ వచ్చని అంచనాలు తయారు చేసినట్లు తెలుస్తోంది.

 ఎక్కువ ఖర్చు వాటికే

ఎక్కువ ఖర్చు వాటికే

ఈ చిత్రాన్ని ఎలాంటి గ్రాఫిక్స్ వర్క్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. దీంతో ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

 బ్రదర్స్‌గా కనిపించబోతున్న చరణ్, తారక్

బ్రదర్స్‌గా కనిపించబోతున్న చరణ్, తారక్

ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తయింది. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది. త్వరలోనే అన్ని విషయాలు అఫీషియల్ గా వెల్లడించనున్నారు.

 9 నెలలు షూటింగ్ షెడ్యూల్

9 నెలలు షూటింగ్ షెడ్యూల్

ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. 9 నెలలు పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే సంక్రాంతికి గానీ విడుదలయ్యే అవకాశం ఉంది.

 హిందీ, తమిళంలో కూడా

హిందీ, తమిళంలో కూడా

ఈ మల్టీ స్టారర్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. బాహుబలితో రాజమౌళి సినిమాలకు హిందీలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. డబ్బింగ్ సినిమాలతో ఎన్టీఆర్ కూడా హిందీలో పాపులర్ అయ్యాడు. ఇక తమిళంలో తెలుగు సినిమాలు బావుంటే తప్పకుండా ఆడతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X