అదిరిపోయే అప్డేట్.. త్వరలోనే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

ప్రస్తుతం మెగా హీరోలందరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి సెట్స్ మీదుండగానే తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తున్నారు. అలా రామ్ చరణ్ మాత్రం సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్‌పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మరో వైపు ఎన్టీఆర్ మాత్రం తన సినిమాను రెడీ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లోకి జంప్ అవుతాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా ఏ ప్రాజెక్ట్‌ను ఓకే చేయకుండా కాలయాపన చేస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ తరువాతే..

ఆర్ఆర్ఆర్ తరువాతే..

అయితే రామ్ చరణ్ ఓకే అనాలే గానీ ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్, యంగ్ దర్శకులు రెడీగా ఉన్నారట. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో కథలు విన్నాడని టాక్. తమిళ దర్శకులు చెప్పిన కథలను కూడా రామ్ చరణ్ విన్నాడని, కానీ దేనికీ కూడా ఓకే చెప్పలేదని తెలుస్తోంది.ఏదైనా కూడా ఆర్ఆర్ఆర్ తరువాత చెబుతానని అంటున్నాడట.

త్వరలోనే ముగింపు..

త్వరలోనే ముగింపు..

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. క్లైమాక్స్‌ను షూట్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను వదిలేయనున్నాడు. ఆ తరువాతే వారు తమ తమ ప్రాజెక్ట్‌ల్లోకి అడుగుపెడతారు. అయితే తాజాగా రామ్ చరణ్ 15వ ప్రాజెక్ట్ గురించి చిన్న అప్డేట్ వచ్చింది.

రామ్ చరణ్ టీం..

రామ్ చరణ్ టీం..

టీం రామ్ చరణ్ అనే ట్విట్టర్ ఖాతా తాజాగా ఓ పోస్ట్ చేసింది. రామ్ చరణ్ 15వ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది. అంతవరకు దర్శకుడు ఎవరో గెస్ చేస్తూ ఉండండని ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఎంతో ఆసక్తిగా కొన్ని కాంబినేషన్‌లు చెబుతున్నారు.

 శంకర్‌తో సినిమా..

శంకర్‌తో సినిమా..

ఇండియన్ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా ఉండబోతోందని ఎప్పటినుంచో రూమర్లు వస్తున్నాయి.దానికి తగ్గట్టే ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ కాంబోలో సినిమా అంటూ నేషనల్ వైడ్‌గా ఓ ట్రెండ్ ప్రారంభమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

 మరో వైపు అలా..

మరో వైపు అలా..

రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో సినిమా వస్తుందని అంటున్నారు. ఇంకొందరు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతోన్నాడని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఇప్పుడు రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే చెర్రీ తన తదుపరి చిత్రాల అప్డేట్లను ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X