మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. రామ్ చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు..!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నారు. రంగస్థలం సినిమాతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న చెర్రీ.. ఇటు నటుడిగా, అటు నిర్మాతగా రాణిస్తున్నారు. ఓ వైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు 'సైరా నరసింహా రెడ్డి' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు రామ్ చరణ్.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తండ్రి చిరంజీవి కోరికను తీర్చుతూ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సైరా రూపొందించారు రామ్ చరణ్. అక్టోబర్ 2వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం మేరకు మరో భారీ ప్రాజెక్టు చేజిక్కుంచుకున్నారట రామ్ చరణ్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన 'లూసిఫర్' సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ చేజిక్కుంచుకుందని సమాచారం.

మలయాళంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'లూసిఫర్' సినిమాలో మోహన్‌లాల్ లీడ్ రోల్ పోషించారు. చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ తీసుకోవడం పట్ల ఆనందంగా ఉన్నారట డైరెక్టర్ పృథ్వీరాజ్. సో 'లూసిఫర్' తెలుగు రీమేక్‌ని రామ్ చరణ్ ఎవరిని హీరోగా పెట్టి తీస్తాడనేదే ఇక్కడ పాయింట్. ఈ విషయమై ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చలు మొదలయ్యాయి. కొందరైతే ఇందులోనూ చిరంజీవినే హీరోగా తీసుకుంటారని అంటున్నారు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!.


Click it and Unblock the Notifications











