చరణ్ మళ్ళీ అతని డైరెక్షన్ లో చేయాలంటూ ముచ్చటపడుతున్నాడు...
నవంబర్ రెండో వారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న రామ్ చరణ్ 'ఆరెంజ్" ట్రైలర్‌ని దర్శకనిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ 'సిడ్నీ నగరం..." అంటూ జెనీలియాతో చేస్తున్న రొమ్యాటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే సినిమా రిలీజ్ కాకముందే.... ఆడియో పాటు, ట్రైలర్ హిట్ కొట్టడంతో సినిమా కూడా గత రికార్డులను తిరగరాస్తుంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. చరణ్ ప్రస్తుతం ధరణి డైరెక్షన్ లో 'మెరుపు" సినిమాలో నటిస్తున్నాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చిరుత" సినిమాతో తెరంగేట్రం చేసిన చరణ్, ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న చరణ్, సంవత్సరానికి రెండు సినిమాలు ఖచ్చితంగా విడుదలయ్యేలా చూసుకుంటానని చెబుతున్నాడు. ఇక మరోమారు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటించాలని వుందంటోన్న చరణ్, 2011 లో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నాడు. 'పోకిరి" తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఓ వెలుగు వెలిగిన పూరి, ప్రస్తుతం కెరీర్ లో స్లంప్ ఎదుర్కొంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో చరణ్ పూరి కాంబినేషన్ వర్కవుట్ అవుతందో లేదో...!


Click it and Unblock the Notifications











