రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బాలీవుడ్ హీరోయిన్ చిచ్చు?
టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా ఎదిగారు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి చూపిన బాటలోనే పయనించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. ఎంతో కష్టపడి తమ ప్రతిభను చూపారు. డిఫెరెంట్ జోనర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనే కాకుండా ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో తమకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన వీరికి మాట్లల్లేవని ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ అంటూ చెబుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ తర్వాత 4 ఏళ్లకు రామ్ చరణ్ చిరుత సినిమాతో ఆడియెన్స్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఇక రామ్ చరణ్ ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఉండింది. ఇక అప్పటికే అల్లు అర్జున్ ఆర్య, బన్నీ, హ్యాపీ దేశ ముదురు వంటి చిత్రాలతో భారీ సక్సెస్ అందుకోవడం, యంగ్ స్టార్ గా గుర్తింపు పొందడం విశేషం.

రామ్ కాస్తా ఆలస్యంగా వచ్చినా మగధీర, ఆరెంజ్, రచ్చ, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అటు అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందారు. అలాగే నేషనల్ అవార్డ్ అందుకు తొలి తెలుగు హీరోగా చెరగని ముద్ర వేశారు. ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఎవడు అనే చిత్రంలో అల్లు అర్జున్ క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమై చర్చ కొనసాగుతోంది. అల్లు అర్జున్ రామ్ చరణ్ 18 ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదని కొత్తగా పుకారు హిందీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పలు బాలీవుడ్ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో మరింత చర్చ జరుగుతోంది. అయితే బాలీవుడ్ కు చెందిన ఒక హీరోయిన్ తో బన్నీ ప్రేమలో పడ్డారని, కానీ ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలిచిత్రంలో నటించి బన్నీకి దూరమైందని ఆ రూమర్ సారాంశం. ఆ హీరోయిన్ వల్లనే ఇద్దరి మధ్య 18 ఏళ్లుగా మాటల్లేవని ప్రచారం చేస్తున్నారు.
కానీ 11 ఏళ్ల కిందనే ఇద్దరు కలిసి ఎవడు అనే చిత్రంలో నటించడం విశేషం. వారి మధ్య మాటల్లేకుంటే అప్పుడు ఎందుకు సినిమా చేసి ఉంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ఇక మరోవైపు అటు అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం AA22xA6తో, ఇటు రామ్ చరణ్ పెద్ది చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ గా వ్యాప్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.


Click it and Unblock the Notifications











