RC16: రామ్ చరణ్ కొత్త మూవీ బడ్జెట్ లీక్.. ఏంటి అన్ని వందల కోట్లా!
తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలకే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను అందుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు. దీనికితోడు RRR మూవీతో గ్లోబల్ రేంజ్‌కు ఎదిగాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కనుందని ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. శంకర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది ప్రారంభం కాబోతుందట.
పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భారీ స్కేల్‌లో తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ చిత్రం కోసం నిర్మాతలు భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమాను ఏకంగా రూ. 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు సమాచారం లీకైంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు రూ. 400 కోట్లు కేటాయించడానికి రెమ్యూనరేషన్లు కూడా కారణం అని తెలుస్తోంది. ఇందులో ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లు నటిస్తుండడం వల్ల వాళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్లు అధనం అయ్యాయట. ఈ కారణంగానే ఈ చిత్రానికి బడ్జెట్ భారీగా అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











