రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాక్.. గ్లోబల్ స్టార్ ఎంట్రీ మరింత ఆలస్యం

తెలుగు సినిమా నుంచి వచ్చినా గ్లోబల్ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో తనదైన సినిమాలతో సత్తా చాటుతోన్న అతడు.. హిట్లను కూడా వరుసగానే అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎస్ శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై మొదట్లోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఇలా ఈ ప్రతిష్టాత్మక సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు.

Ram Charan and Buchi Babu Sana Movie Starts Delay

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సన చేయబోయే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందని ఇప్పటికే సమాచారం బయటకొచ్చింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. దీన్ని మరికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

యూనివర్శల్ కాన్సెప్టుతో హై రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. అనుకున్న సమయానికి దీన్ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

Ram Charan and Buchi Babu Sana Movie Starts Delay

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నవంబర్ నుంచి ఈ మూవీ షూట్ స్టార్ట్ అయినా.. రామ్ చరణ్ మాత్రం వచ్చే ఏడాదే ఇందులో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఇది మెగా అభిమానులకు షాకిచ్చే న్యూసే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని ఇస్తున్నారు.

Read more about: ram charan buchi babu sana rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X