RC16: మెగా ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. బుచ్చిబాబు మూవీపై చరణ్ సంచలన నిర్ణయం

గతంలో కంటే ఇప్పుడు తెలుగు హీరోల రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటోన్న ఈ మెగా హీరో.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను అనౌన్స్ చేసేశాడు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ చిత్రం పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు సనతో చేయడానికి అంగీకరించాడు.

Ram Charan and Buchi Babu Sana Movie Starts From 2025 First Half

రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సన రూపొందించబోయే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే సమాచారం లీక్ అయిపోయింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గేమ్ చేంజర్ షూట్ పూర్తైన వెంటనే ఈ మూవీ మొదలవుతుందని అంటున్నారు.

క్రీడా నేపథ్యం ఉన్న కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన సెటప్‌ను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు మిగిలిన అన్నింటినీ రెడీగా పెట్టుకున్నాడు. సరైన ముహూర్తానికి దీన్ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.

హై రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాను అంతా అనుకున్నట్లుగా ఈ ఏడాది ప్రారంభించడంలేదట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే రామ్ చరణ్ ఈ చిత్రం కోసం స్పెషల్ మేకోవర్‌తో సిద్ధం కావాలని డిసైడ్ అవడమే అని తెలిసింది. ఇందుకోసం అతడు 6 నెలలు సమయం తీసుకుంటున్నాడట. అందుకే ఈ చిత్రం లేటుగా మొదలు కాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X