మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్: వాళ్లిద్దరి కాంబోలో 15 నిమిషాలు.. మామూలుగా ఉండదు.!

By Manoj Kumar P

స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. పెద్ద పెద్ద హీరోలతో పోటీ పడి మరీ స్టార్‌గా వెలుగొందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు అదే పొజిషన్‌లో కొనసాగుతున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన.. చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఓ బడా మూవీలో నటిస్తున్నారు. తాజాగా దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

కమ్ బ్యాక్ అదిరింది.. రెండోదే బెడిసి కొట్టింది

కమ్ బ్యాక్ అదిరింది.. రెండోదే బెడిసి కొట్టింది

‘ఖైదీ నెంబర్ 150'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో పాటు కలెక్షన్లను కూడా భారీగా రాబట్టింది. అదే సమయంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, దీని తర్వాత చిరు నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఈ మూవీ నిరాశనే మిగిల్చింది.

బడా డైరెక్టర్‌తో కలిసిన మెగాస్టార్ చిరంజీవి

బడా డైరెక్టర్‌తో కలిసిన మెగాస్టార్ చిరంజీవి

‘సైరా' ఫలితంతో కొంత నిరుత్సాహ పడిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన.. బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

మళ్లీ అదే ఫార్ములా.. చిరును మాత్రం కొత్తగా

మళ్లీ అదే ఫార్ములా.. చిరును మాత్రం కొత్తగా

తన గత చిత్రాల మాదిరిగానే ‘ఆచార్య'ను కూడా సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. అయితే, ఇందులో మాత్రం చిరంజీవిని కొత్తగా చూపించబోతున్నాడు. ఇటీవల లీక్ అయిన ఫొటో ఆధారంగా.. ఇందులో ఆయన నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే పాత్రలో చిరు అద్భుతంగా నటిస్తున్నారని తెలుస్తోంది.

చరణ్.. మహేశ్ బాబు.. ఇద్దరిలో ఎవరు ఫైనల్.?

చరణ్.. మహేశ్ బాబు.. ఇద్దరిలో ఎవరు ఫైనల్.?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ మధ్య చరణ్ కాదు.. ఇందులో మహేశ్ బాబు నటిస్తున్నాడని అన్నారు. ఆయన రెమ్యూనరేషన్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే, చిత్ర యూనిట్ చెప్పిన ఆఫర్ నచ్చకపోవడంతో ఆయన తప్పుకున్నాడని తెలుస్తోంది.

మెగా మల్టీస్టారర్‌గా ఆచార్య.. చరణ్ రోల్ ఇదే

మెగా మల్టీస్టారర్‌గా ఆచార్య.. చరణ్ రోల్ ఇదే

మహేశ్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌నే ఫైనల్ చేశారని అంటున్నారు. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రను అతడు పోషిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. చెర్రీ ఇందులో నక్సలైట్‌గా నటిస్తున్నాడని, ఓ మిషన్‌లో భాగంగా అతడు మరణిస్తే.. చిరంజీవి దానిని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

వాళ్లిద్దరి కాంబోలో 15 నిమిషాలు హైలైట్

వాళ్లిద్దరి కాంబోలో 15 నిమిషాలు హైలైట్

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాలు పాటు ఉంటుందని తెలుస్తోంది. అందులో పదిహేను నిమిషాలు చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అంతేకాదు, వీళ్లిద్దరి కలయికలో వచ్చే సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా చరణ్‌, చిరు కలిసి చేసే ఓ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X