RRR లేటెస్ట్ అప్‌డేట్: మూవీలో హైలైట్ ఇదే.. ఎన్టీఆర్, చరణ్ కలిసి ఏకంగా పదిహేను నిమిషాలు.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి ఆయన చేసిన సినిమాలే కారణం. గతంలో ఆయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ఈ మధ్య వచ్చిన 'బాహుబలి' సిరీస్‌తో రాజమౌళి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. అదే సమయంలో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇంత భారీ విజయాన్ని అందుకున్న తర్వాత దర్శకధీరుడు చేస్తున్న చిత్రమే RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అదిరిపోయే కాంబినేషన్‌తో వస్తున్న RRR

అదిరిపోయే కాంబినేషన్‌తో వస్తున్న RRR

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో లండన్ నటి ఒలీవియా మోరిస్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే, ఇందులో సముద్రఖని, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ సహా హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

సినిమా షూటింగ్ అప్‌డేట్‌పై యూనిట్ ప్రకటన

సినిమా షూటింగ్ అప్‌డేట్‌పై యూనిట్ ప్రకటన

RRR సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అయిపోతోంది. అప్పటి నుంచి నటీనటులకు గాయాలు కావడం.. డేట్స్ అడ్జస్ట్‌మెంట్స్ సహా కొన్నింటి వల్ల పలుమార్లు ఈ సినిమా షూటింగ్‌కు అంతరాయాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఒక్కటి రాకున్నా అంచనాలు పెరుగుతున్నాయి

ఒక్కటి రాకున్నా అంచనాలు పెరుగుతున్నాయి

ఈ సినిమా ప్రకటన సమయంలోనూ.. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైనప్పుడూ రెండు ఫొటోలను వదిలారు దర్శకధీరుడు రాజమౌళి. ఇవి మినహా సినిమా నుంచి ఒక్క పోస్టర్ గానీ, పాట గానీ, టీజర్ గానీ బయటకు రాలేదు. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి.

సినిమా రిలీజ్‌పై పెరుగుతున్న అనుమానాలు

సినిమా రిలీజ్‌పై పెరుగుతున్న అనుమానాలు

షూటింగ్ డెబ్బై శాతం మాత్రమే పూర్తవడం.. ఇంకా ముఖ్యమైన సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీకరించాల్సి ఉండడం వల్ల RRR విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది జరగకపోవచ్చని అంటున్నారు.

Recommended Video

Gaddar To Sing A Song For Komaram Bheem's Charecter In RRR
RRR మూవీలో హైలైట్ సీన్ ఇదేనట

RRR మూవీలో హైలైట్ సీన్ ఇదేనట

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ చేస్తున్న రెండు పాత్రలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి ప్రత్యర్థులపై యుద్ధం చేస్తారట. ఇది ఏకంగా పదిహేను నిమిషాలు ఉంటుందని అంటున్నారు. ఈ సీన్ మూవీకే హైలైట్‌గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X