RRR మూవీకి రామ్ చరణ్, ఎన్టీఆర్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత?

బాహుబలి సినిమా వచ్చే వరకు ఇండియన్ సినిమా మార్కెట్ స్టామినా ఏమిటో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అంచనా వేయలేక పోయారు. ఈ సినిమా తర్వాత సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లోనూ పలు భారీ బడ్జెట్ చిత్రాలు మొదలయ్యాయి. అయితే ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు మొదలైనపుడు అందులో ప్రత్యేకత ఏమిటి? అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతూ ఉంటారు.

అదే సమయంలో ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించే ముఖ్య నటులకు భారీగానే రెమ్యూనరేషన్ ముడుతుంది అనే విషయాలు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా RRR మూవీ విషయంలో ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాలతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్, చరణ్ రెమ్యూనరేషన్ ఎంత?

ఎన్టీఆర్, చరణ్ రెమ్యూనరేషన్ ఎంత?

RRR మూవీలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం తాజాగా చర్చనీయాంశం అయింది. ఇద్దరికీ చెరో రూ. 25 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది.

మామూలుగా సినిమాలకు వీరి రెమ్యూనరేషన్ ఎంత?

మామూలుగా సినిమాలకు వీరి రెమ్యూనరేషన్ ఎంత?

మామూలు సినిమాలకు రామ్ చరణ్, ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ సగటున రూ. 15 కోట్ల వరకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే RRR ప్రత్యేకమైన సినిమా కావడంతో వీరికి రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట.

ఈ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి హీరోలుగా...

ఈ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి హీరోలుగా...

RRR మూవీ ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఇప్పటి వరకు రీజనల్ హీరోలుగా, సౌత్ ఇండియా వరకే పరిమితమైన ఈ ఇద్దరు హీరోల ఇమేజ్.... RRR రిలీజ్ తర్వాత ప్యాన్ ఇండియా వైడ్ విస్తరించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వీరు నటించిన రీజనల్ సినిమాలు హిందీలో అనువాదమై శాటిలైట్ ఛానల్స్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలో విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

RRR

RRR

RRR మూవీ విషయానికొస్తే... ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందుతోంది. 1920 బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ మూవీ ఉంటుంది. అల్లూరి పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X