రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య బాక్సాఫీస్ ఫైట్.. ఆ రెండు సినిమాలు ఒకేసారి..?
కరోనా వైరస్ కారణం చాలా సినిమాల విడుదల తేదీల విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇతర సినిమాలతో రిలీజ్ డేట్స్ తో ఎదురవుతున్న ఇబ్బందులతో హీరోలకు దర్శక నిర్మాతలు కూడా విభేదాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్ లో సినిమాల మధ్య భారీ స్థాయిలో ఫొటో నెలకొంటోంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు కూడా ఒకేసారి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య కూడా ఇదే విషయంపై చర్చ కొనసాగుతోంది.

RRR వాయిదా?
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన RRR సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 7వ తేదీన రావాల్సిన ఈ సినిమా మళ్ళీ సమ్మర్ లోకి షిఫ్ట్ అయ్యింది. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి కూడా ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

టెన్షన్ నుంచి బయటకు రావడానికి
RRR వాయిదా పడింది అనగానే హీరోలు ఇద్దరు కూడా కొంత డిప్రెషన్ లోకి వెళ్లినట్లు అనేక రకాల కథనాలు వేలువడ్డాయి. నెలరోజుల పాటు నిర్విరామంగా చేసిన ప్రమోషన్స్ అన్ని కూడా వృధా అయ్యాయి. ఇక RRR టెన్షన్ నుంచి బయటకు రావడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇటీవల వారి తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

RC 15వ సినిమా..
రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా సోషల్ డ్రామాగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ ఆ సినిమా ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ ఆదుకోవాలని చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

30వ సినిమాతో బిజీగా ఎన్టీఆర్
ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో సోలోగా పాన్ ఇండియా సినిమాను (NTR 30) స్టార్ట్ చేయనున్నాడు. జనతా గ్యారేజ్ అనంతరం ఈ ఇద్దరు మళ్ళీ మరో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని ఊఆ రివెంజ్ డ్రామాతో రానున్నట్లు సమాచారం. ఆ సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

బాక్సాఫీస్ పోటీ..?
అయితే RC 15వ సినిమాతో పాటు NTR 30వ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2023 సంక్రాంతికి రామ్ చరణ్ సినిమాను రిలీజ్ చేయాలని శంకర్ పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు కొరటాల శివ కూడా తారక్ తో వీలైనంత త్వరగా షూటింగ్ ను ఫినిష్ చేసి 2023 పొంగల్ భరిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడట. మరి ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ నిజంగానే ఉంటుందా లేక చివరి నిమిషంలో మళ్ళీ ఎప్పటిలానే చర్చలతో విడుదల డేట్స్ మారతాయా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











