ఒకే తెరపై పవన్, రామ్ చరణ్.. సాధ్యమేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే పవన్ సినిమాల్లో నటించానని తెలిచి చెప్పేయటం, మరోవైపు RRR షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కలయిక ఎంత వరకు సాధ్యమనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలుకావడంతో ఇక ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిని తిప్పికొడుతూ తాను ప్రజల్లోనే ఉంటానని, సినిమాల్లోకి వచ్చే ఆలోచనలు లేవని తేల్చేశారు పవన్. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కూడా ప్రస్తావించాడు. ఈ విష‌యం గురించి నాగ‌బాబు చెబుతూ చిరంజీవి రాజ‌కీయాలు వ‌ద్ద‌నుకుని మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చాడ‌ని.. ప‌వ‌న్ మాత్రం అలా కాద‌న్నాడు. అక్క‌డితో ఆగ‌కుండా మ‌ధ్య‌లో చిన్నచిన్న అతిథిపాత్ర‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ అభిమానుల‌కు కాస్త తీపిక‌బురు చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్.

Ram Charan and Pawan Kalyan Will Appear in Single Screen..?

దీంతో వెంటనే రామ్ చరణ్ సినిమాలో పవన్ నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. RRR ఫినిష్ కాగానే రామ్ చరణ్ నటించబోయే తదుపరి సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేయనున్నారని, బాబాయ్- అబ్బాయ్ ఒకే తెరపై కనిపించనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో చిరంజీవి నటించిన శంక‌ర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో అన్నయ్యతో తెర పంచుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రకంగా చూస్తే చెర్రీ సినిమాలో పవన్ నటించడానికి అవకాశాలు ఉన్నాయనే తెలుస్తోంది.

మరోవైపు పవన్, తన జీవితం మొత్తం జనానికే అంకితం అని బల్లగుద్ది చెబుతుండటం చూస్తుంటే చెర్రీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది రూమర్ అని అర్థమవుతోంది. ఈ మేరకు ఇదే అంశంపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు ముదిరాయి. సో అఫీషియల్ ప్రకటన లేనిదే ఇలాంటి వార్తలను నమ్మలేం. కాకపోతే చెర్రీ, పవన్ కలయిక అనే సరికి మెగా అభిమానుల్లో ఆనందం చిగురించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X