RC15: మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. చరణ్, శంకర్ మూవీ టైటిల్ పోస్టర్ ఆరోజే

పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ బడా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను దక్కించుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఫలితంగా తన క్రేజ్‌తో పాటు మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇక, ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్.. సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ఇప్పటికే ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండియన్ సినీ చరిత్రలోనే దిగ్గజ దర్శకుడిగా పేరొందిన ఎస్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఆ వెంటనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేసిన ఈ దిగ్గజ దర్శకుడు.. వాటిని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలెట్టేశారు. అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ఈ సినిమా.. ఆరంభంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి దృష్టినీ తిప్పుకున్న విషయం తెలిసిందే.

Ram Charan and S. Shankar Movie Title Poster on May 19th

రామ్ చరణ్ హీరోగా ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ రాజమహేంద్రవరంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడి ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇక, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలోని సముద్ర తీరంలో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్‌పై జనసందోహం మధ్యలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా అప్‌డేట్ల గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మే 19వ తేదీని విడుదల చేయబోతున్నారట. ఈ ప్రకటన బుధవారం సాయంత్రమే రాబోతుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రానికి 'సర్కారోడు' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు దీన్ని ఫిలిం చాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

శంకర్ మార్క్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X