రామ్ చరణ్‌ మూవీపై శంకర్ యూటర్న్: ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఎందుకిలా చేస్తున్నారబ్బా!

పేరుకు మెగాస్టార్ కుమారుడే అయినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో పాన్ ఇండియాపై దృష్టి సారించిన అతడు.. భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇందులో భాగంగానే లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

Recommended Video

Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం

భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

తండ్రితో కలిసి తెరను పంచుకుని

తండ్రితో కలిసి తెరను పంచుకుని

RRR మూవీతో పాటు ప్రస్తుతం రామ్ చరణ్ మరో సినిమాలోనూ నటిస్తున్నాడు. అదే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య'. ఇందులో ఎంతో ముఖ్యమైన సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో అతడు కనిపించబోతున్నాడు. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర చనిపోతుంది. ఆ రోల్‌కు సంబంధించిన పోస్టర్ కూడా కొద్ది రోజుల క్రితమే విడుదలైంది.

శంకర్‌తో చరణ్ సినిమా ప్రకటన

శంకర్‌తో చరణ్ సినిమా ప్రకటన

రామ్ చరణ్ నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి చాలా కాలంగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా ఈ స్టార్ హీరో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో అతడు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

లేట్ అవుతుందని... అదే పనిలో

లేట్ అవుతుందని... అదే పనిలో


చాలా ఏళ్ల క్రితమే శంకర్‌.. కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2'ను ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. దీంతో ఇది ఆలస్యం అవుతుందనుకున్నారు. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శంకర్.. చరణ్ సినిమా పనులు చేస్తున్నారు.

చరణ్‌ మూవీపై శంకర్ యూటర్న్

చరణ్‌ మూవీపై శంకర్ యూటర్న్

రామ్ చరణ్‌తో శంకర్ చేసే సినిమా భారీ బడ్జెట్‌తో దాదాపు ఐదారు భాషల్లో రూపొందనుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇది యూనివర్శల్ కాన్సెప్టుతో వచ్చే చిత్రం కావడంతో భారీగా విడుదల చేయాలని ముందు నుంచే ప్లాన్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను కేవలం మూడు భాషల్లోనే తీయాలని శంకర్ డిసైడ్ అయ్యారట.

స్టార్లు ఎందుకిలా చేస్తున్నారబ్బా

స్టార్లు ఎందుకిలా చేస్తున్నారబ్బా


తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్‌తో చేసే సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మాత్రమే రూపొందించబోతున్నారట. వీలైనన్ని ఎక్కువ భాషల్లో దీన్ని తీస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పుడీ వార్త బయటకు రావడం ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఉన్నట్లుండి చిత్ర యూనిట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X