Mega princess Name: రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు ఇదే.. ఆయన పేరు కలిసివచ్చేలా...
రామ్ చరణ్, ఉపాసన జంట ఈనెల 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మహాలక్ష్మి ఇంటికి వచ్చిందంటూ చిరంజీవి ఇప్పటికే మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక ఘనంగా జరగబోతుంది. అయితే ఈ వేడుకలో మెగా ప్రిన్సెస్ పేరును పెట్టబోతున్నారు. ఇంతకీ ఆ పేరు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి 2012 జూన్ 24న ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన 11 ఏళ్ళకి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మెగా వారసురాలి బారసాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా వారసురాలి పేరును ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరపనున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వేడుకకు మెగా కుటుంబం సహా అల్లు వారి కుటుంబం కూడా హాజరుకానున్నారు. వీరితో పాటు ప్రముఖులుసైతం హాజరు కానున్నారని సమాచారం.

మెగా ప్రిన్సెస్ పేరు ఇదేనంటూ...:అయితే సోషల్ మీడియాలో మాత్రం మెగా ప్రిన్సెస్ పేరు ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి. ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు. కూతురికి ఏం పేరు పెట్టబడుతున్నారు అని అక్కడి రిపోర్టర్ అడగగా ఆల్రెడీ ఒక పేరు అనుకున్నాము... సాంప్రదాయంగా నిర్వహించే వేడుకలో ఆ పేరును బహిర్గతం చేస్తామంటూ చెప్పారు రామ్ చరణ్. బేబీది ఎవరి పోలికా అని అడగ్గా కచ్చితంగా... నాన్న పోలికే అంటూ చెప్పుకొచ్చాడు.

లక్షలు ఖర్చు చేసి వేడుక: మరోవైపు ఈరోజు జరగనున్న బారసాల వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో బారసాల ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు ఉపాసన. లక్షల ఖర్చు చేసి ఇంటిని అందంగా అలంకరిస్తున్నారు. బారసాల కోసం కావాల్సిన వస్తువులు కూడా తీసుకువస్తున్నారు. ఇక ఈ వేడుకకు మెగా కుటుంబం సహా ప్రముఖులు హాజరుకానున్నందున ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.

పేరు ఇలా వచ్చేలా...:అయితే ఉపాసన, రామ్ చరణ్ దంపతుల కూతురు పేరు ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. ఓ వైపు బేబీ మంగళవారం పుట్టింది... మంగళవారం రోజున హనుమంతుడిని పూజిస్తాం. అంతేకాకుండా చిరంజీవికి హనుమంతుడు ఇష్ట దైవం. కాబట్టి ఉపాసన కూతురు పేరు కచ్చితంగా హనుమంతుడు నామం కలిసేలా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ఉపాసన, రామ్ చరణ్ కుమార్తె పేరు అధికారికంగా తెలియనుంది.

షూటింగులకు బ్రేక్: ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఇప్పటికే సినిమా షూటింగ్ లకు బ్రేక్ నిచ్చాడు. మరో నెల పాటు ఉపాసనతోనే ఉండనున్నట్లు సమాచారం. దీనితో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉండగా... ఈ ఆలస్యంతో సమ్మర్ లో రానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











