గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్, మెగా ఫ్యామిలీలో సంబరాలు

ప్రస్తుతం మెగా కుటుంబంలో ఫుల్ జోష్‌లో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తను నటిస్తోన్న మన శంకర వరప్రసాద్ గారితో చిరు దూకుడు మీదున్నారు. ఇక పవన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు ఇటీవలే ఓజీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్- కోడలు లావణ్య త్రిపాఠిలు ఇటీవలే తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు జరుపుకుంటోంది. తాజాగా దీనిని మరింత రెట్టింపు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసస దంపతులు సిద్ధమయ్యారు.

పదేళ్ల పాటు ప్రేమాయణం
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రి బాటలోనే తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన ఉపాసన కామినేనితో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. పెళ్లికి ముందే ఈ జంట పదేళ్ల పాటు సీక్రెట్‌గా డేటింగ్ చేసింది. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సీ రెడ్డి మనవరాలే ఉపాసన. అనిల్ - శోభ దంపతుల కుమార్తె. అపోలో సంస్థలకు వైస్ ఛైర్మన్‌గా బిజినెస్‌లోనూ దూసుకెళ్తున్నారు ఉపాసన.

Ram Charan and Upasana Konidela are expecting their 2nd baby Global star s video goes viral

స్పోర్ట్స్ క్లబ్‌లో పరిచయం
ఓ స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఉపాసనతో రామ్ చరణ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పలుమార్లు వీరు కలుసుకోగా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. దాదాపు పదేళ్ల ప్రేమాయణం తర్వాత ఇరు కుటుంబాల్లోనూ తమ ప్రేమ విషయం బయటపెట్టారు. దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లయి దాదాపు పదేళ్లకు పైనే గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో పలుమార్లు ఈ జంట ఇబ్బంది పడింది. దీనికి ఉపాసన చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చింది. ప్రెగ్నెంట్ కావడం, పిల్లలు కనడం అనేది నా వ్యక్తిగత విషయమని తేల్చిచెప్పేశారు.

క్లీంకారాకు జన్మనిచ్చిన ఉపాసన
ఈ క్రమంలో 2023 జూన్‌లో ఉపాసన - రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ బిడ్డకు లలితా సహస్ర నామాల్లోని అమ్మవారి 622వ నామం.. క్లీం కార అనే పేరు పెట్టారు. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టిన నాటి నుంచి చిరంజీవి ఫ్యామిలీలో అంత మంచే జరుగుతోంది. అయితే ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీ కపుల్స్ రెండోసారి తల్లిదండ్రులు అవుతుండటంతో ఉపాసన ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరోసారి గర్భం దాల్చిన ఉపాసన
అయితే తాజాగా రామ్ చరణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని నాగార్జున, వెంకటేష్, నయనతార తదితర సినీప్రముఖులతో పాటు పలువురు బంధుమిత్రులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటం పాటు ఆమెకు అత్తగారు సురేఖ, తల్లి శోభ, ఇతర ముత్తయిదువులు హారతి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దానికి తోడు ఈ దీపావళికి మా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయని, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. దాంతో ఉపాసన రెండోసారి తల్లికాబోతున్నారని చరణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్ - ఉపాసనలు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X