RRRను కొట్టేలా మరో బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్.. రామ్ చరణ్‌తో మరొక అగ్ర హీరో షాక్ ఇచ్చే ప్లాన్!

మిగతా సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో మార్పులు వచ్చాయో చెప్పలేము కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త మార్పులు వచ్చినట్లు చెప్పవచ్చు. ముఖ్యంగా బాహుబలి అనంతరం టాలీవుడ్ స్థాయి అమాంతంగా నేషనల్ లెవెల్ లో పెరిగిపోయింది. మన సినిమాలు హిందీ సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాదని దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంత మంది దర్శకులు బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రయోగాత్మకమైన కథలు కూడా తెలుగులోనే ఎక్కువగా వస్తుండడం విశేషం. నేటి తరం దర్శకులు కూడా భారీ ప్రయోగాలతోనే మిగతా ఇండస్ట్రీ వారికి షాక్ ఇస్తున్నారు.

వాటన్నింటికి మించి పోయేలా

వాటన్నింటికి మించి పోయేలా

ఇక ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల హవా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక RRR సినిమా అనంతరం ఆచార్య సినిమా కూడా అలాంటి తరహాలోనే తెరకెక్కుతోంది. ఇక వాటన్నింటికి మించి పోయేలా మరొక బిగ్గెస్ట్ మల్టిస్టారర్ నువ్వే త్వరలోనే టాలీవుడ్ లో రూపొందనున్న ఇట్లు వస్తుంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని మల్టీ స్టారర్ సినిమాలో సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత పదేళ్ల ముందు వరకు కూడా మల్టీస్టారర్ సినిమాలు అంటే ఎప్పుడో ఒకటి వచ్చేవి. కేవలం చిన్న హీరోలతో మాత్రమే వచ్చేవి. మన ఇండస్ట్రీలో పెద్ద హీరోలు మల్టీస్టారర్ యాక్షన్ సినిమాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ.

పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ అయ్యేలా

పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ అయ్యేలా

ఇక RRR సినిమాతో అయితే ఇండస్ట్రీలో సరికొత్త ఫార్మాట్ లో ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పవచ్చు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు అంటే అది అంత సాధారణ విషయం కాదు. అందులోనూ దర్శకుడు రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి సినిమా తప్పకుండా పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు.

ఇక RRR ఆర్ వచ్చిన అనంతరం మల్టీస్టారర్ అనే పదం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. మన హీరోల మార్కెట్ పెరుగుతోంది కాబట్టి నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో హద్దులు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

రామ్ చరణ్ - ప్రభాస్ మల్టీస్టారర్

రామ్ చరణ్ - ప్రభాస్ మల్టీస్టారర్

యు.వి.క్రియేషన్స్ కూడా వారి స్థాయిని పాన్ ఇండియా లెవల్లో మరింత పెంచుకోవాలని అడుగులు వేస్తున్నారు. ఇక వారు మల్టీస్టారర్ సినిమాలు చేయగలిగితే ఇందులో ప్రభాస్ తప్పకుండ ఉంటాడు అని చెప్పవచ్చు. ముందు నుంచి ఈ నిర్మాతలతో సన్నిహితంగా ఉంటున్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగానే వైరల్ అవుతోంది.

Recommended Video

RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
కథల కోసం వేట..

కథల కోసం వేట..

ఇంతవరకు యు.వి.క్రియేషన్స్ నుంచి అయితే ఇలాంటి క్లారిటీ రాలేదు. కానీ నీ రామ్ చరణ్ తో మాత్రం ఒక సినిమా చేయాలని ఈ ప్రొడక్షన్ హౌస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. రామ్ చరణ్ తో యూవీ నిర్మాతలకు మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. ప్రభాస్ కూడా మెగా పవర్ స్టార్ కు మంచి స్నేహితుడు.

ఈ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా అంటే అభిమానుల అంచనాలను ఆకాశాన్ని దాటేస్తాయి కాబట్టి సెట్టవ్వడానికి కాస్త సమయం పడుతుందట. ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ ఈ కాంబినేషన్ కోసం కథల వేటలో ఉన్నట్లు సమాచారం. సరైన కథతో పాటు దాన్ని తెరకెక్కించే టాలెంటెడ్ దర్శకుడు కూడా సిద్ధమైతే ప్రాజెక్టు సెట్స్ పైకి రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X