మరో తమిళ దర్శకుడితో రామ్ చరణ్ బిగ్ బడ్జెట్ మూవీ.. అలా క్లారిటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక మన హీరోల కోసం పరభాషా దర్శకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకులు మన తెలుగు అగ్రహీరోలతో వర్క్ చేయడానికి నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నారు. రామ్ చరణ్ తేజ్ కు కూడా అదే తరహాలో ఆఫర్లు అయితే వస్తున్నాయి. కానీ చరణ్ తొందరపడకుండా తనకు నచ్చిన కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. రీసెంట్ గా మరో తమిళ దర్శకుడితో కూడా అతని ప్రాజెక్టు ఓకే అయినట్లే అని క్లారిటీ వచ్చేసింది.. ఆ వివరాల్లోకి వెళితే..

స్క్రిప్ట్ విషయంలో

స్క్రిప్ట్ విషయంలో


ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా నేటి తరం హీరోలు తొందరపడకుండా కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. పూర్తిస్థాయిలో నమ్మకంగా అనిపించి అందరికీ నచ్చుతుంది అనుకుంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక స్క్రిప్ట్ విషయంలో కూడా ఏ మాత్రం రాజీపడటం లేదు. కథ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కూడా దర్శకులకు ఒకే చెప్పడం లేదు. రామ్ చరణ్ లిస్టులో కూడా కొంతమంది యువ దర్శకులు ఉన్నారు కానీ ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా

బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా

RRR సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి ఒక్కసారిగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ హీరోతో సినిమా చేయడానికి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది.

ఎమోషనల్ డ్రామా

ఎమోషనల్ డ్రామా

అయితే రామ్ చరణ్ తేజ్, గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా గా ఉంటుంది అని తెలుస్తోంది. మొదట స్పోర్ట్స్ డ్రామా కాదు అని అందరు అనుకున్నారు. కానీ అది అలాంటి ప్రాజెక్టు కాదు అని రామ్ చరణ్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.

 మరో తమిళ దర్శకుడితో

మరో తమిళ దర్శకుడితో

ఇక రామ్ చరణ్ తేజ్ త్వరలోనే మరో తమిళ దర్శకుడితో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. లోకేష్ కనగరాజ్ అని సమాచారం.. ఖైదీ మాస్టర్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న లోకేష్ గత కొంతకాలంగా తెలుగు హీరోలతో కూడా వర్క్ చేయాలని చర్చలు జరుపుతున్నాడు. ఇదివరకే అతను రామ్ చరణ్ తో కథ చర్చల్లో పాల్గొన్నాడు.

డేట్స్ దొరికితే..

డేట్స్ దొరికితే..

ఇక రీసెంట్ గా విక్రమ్ సినిమా ప్రమోషన్ లో లోకేష్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాడు. కొంతమంది యువ హీరోలతో బిగ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లుగా వివరణ ఇస్తూ.. అందులో ఒక హీరో కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అన్నారు. ఇక ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి రామ్ చరణ్ ఈ డైరెక్టర్ ప్రాజెక్టుకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X