»   » చెర్రీ అలాంటి పాత్రలో నటిస్తున్నాడా?: పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు..

చెర్రీ అలాంటి పాత్రలో నటిస్తున్నాడా?: పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు..

Subscribe to Filmibeat Telugu

తెలుగులో 'లవ్ స్టోరీస్'ను డీల్ చేయడంలో సుకుమార్ మార్క్ మిగతావారికి చాలా భిన్నంగా ఉంటుంది. స్క్రీన్ ప్లేకు ఆయనిచ్చే ట్రీట్‌మెంట్ సినిమాను ప్రేక్షకుడికి మరింతగా కనెక్ట్ అయేలా చేస్తుంది. కాబట్టే.. సుకుమార్ ఇప్పటికీ తన 'లవ్' స్టోరీస్ ట్రాక్ కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం కూడా పక్కా ప్రేమ కథా అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించే రామ్ చరణ్.. ఒక పాత్రలో 'వినికిడి లోపం' ఉన్న వ్యక్తిగా నటించనున్నాడట.

Charan

సినిమా మొత్తంలో చరణ్ పల్లెటూరి గెటప్‌లోను, రీసెర్చర్‌గాను రెండు పాత్రల్లోను నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండింటిలో ఏ పాత్రకు వినికిడి లోపం ఉంటుందో అన్నది తెలియాల్సి ఉంది. అంతేకాదు, అసలు ఈ రెండు పాత్రలను సుకుమార్ ఎలా లింకప్ చేయబోతున్నాడన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాగా, సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. పంచెకట్టుతో కనిపిస్తున్న రామ్ చరణ్ లుక్ ఇప్పటికే అభిమానులను ఫిదా చేసింది. చూడాలి మరి సినిమా ఇంకెంత ఫిదా చేస్తుందో!

English summary
Ramcharan was acting as a deaf in Sukumar's movie, it was not confirmed but gossips are circulating in film industry
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu