»   » మగధీరునితో అరుంధతి

మగధీరునితో అరుంధతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవితో నటించాలని ఉంది...అన్న తన కోరికను స్టాలిన్ చిత్రంలో ఓ సాంగ్ లో నటించి తన కోరికను తీర్చుకుంది..అనుష్క..ఇప్పుడు అతని తనయునితో కలిసి కనబడితే ఎవరైనా ఏం ఊమిస్తారు..చెప్పండి..త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే కదా! అలానే అనుకుంటున్నారు..వీరిద్దర్ని చూసిన సినిమా పెద్దలు. వీరిద్దరు కలిసి దిల్ రాజు నిర్మించిన మరోచరిత్ర ఆడియోను విడుదల చేయడానికి ఒకే స్టేజ్ పైకి వచ్చారు..అది అసలు విషయం ఈ ఫంక్షన్ కు వీరిద్దరు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు. ఒక దశలో వీరిద్దరిని చూసిన ప్రేక్షకులు మరోచరిత్ర జంట వీరిద్దరైతే ఎంత బాగుండు అంటూ నినాదాలు కూడా చేశారు.

ఇదంతా గమనిస్తూ..ప్రక్కనే ఉన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ జంటను చూసి వెంటనే ఓ చిత్రాన్ని వీరిద్దరితో చేయాలనే అనుకున్నట్లుగా సమాచారం. అలాగే దిల్ రాజు కూడా మరోచరిత్రగా ఉన్న జంటపై కాకుండా వీరిద్దరిపైనే చూపులు కలపడం మరో విశేషం..దీన్ని బట్టి చూస్తుంటే మగధీరునితో అరుంధతి కలిసే అవకాశాలున్నాయంటున్నారు..విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu