దొంగమొగుడు, రౌడీ అల్లుడుగా రామ్ చరణ్

By Bojja Kumar

ram charan teja
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. మాస్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు వినాయక్. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో డబల్ రోల్ లో కనిపించనున్నాడని, గతంలో చిరంజీవి నటించిన దొంగమొగుడు, రౌడీ అల్లుడు సినిమాల ఆధారంగా ఈ సినిమా స్టోరీలైన్ ఉంటుందని అంటున్నారు.

రచయిత ఆకుల శివతో కథను రసవత్తంగా తయారు చేయిస్తున్న దర్శకుడు మరో వైపు సినిమాకు సాంకేతిక వర్గం, నటీనటులను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ చెర్రీ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న రచ్చ సినిమా ఫిబ్రవరి 20, 2012న విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X