మెడికల్ స్టూడెంట్ పాత్రలో రామ్ చరణ్

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో మెడికోగా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం తిరుపతి పరిశర ప్రాంతాల్లో షూటింగ్ జరుకుంటున్న ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ గా సమాజంలో జరిగే కొన్ని అన్యాయాలను ఎదుర్కొనే పాత్రల్లో అదరకొట్టనున్నాడని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ రచ్చను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫైట్స్ కు బాగా ఫ్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్తున్నారు. అందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. చైనాలో బాంబో ఫారెస్ట్ లో తీసిన ఆ ఫైట్ సినిమాకు ప్రాణమై నిలుస్తుందని అంటున్నారు. ఆ ఫైట్ కోసం చరణ్ డూప్ ని కూడా పెట్టుకోకుండా తానే నటించాడని,ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ చిత్రం తన కెరీర్ కి ప్లస్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇక మెగా సూపర్‌గుడ్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రచ్చ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌ సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. మొదటి షెడ్యూల్ ని శ్రీలంకలో హీరో, హీరోయిన్స్ పై పాటను షూట్ చేసారు. వందశాతం మాస్‌ చిత్రమిదని, కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్‌ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపించటంకోసం మియామి వెళ్ళి అక్కడ వర్కవుట్స్ చేసి వచ్చారు. చిరంజీవి నైంటీస్ లో వేసిన క్యారెక్టర్స్ తరహాలో ఈ మాస్ రోల్ ఉండబోతోందని వినికిడి. ఇక ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న కథ ప్రకారం తెలంగాణాలో ఓ ప్రాంతం ప్లోరైడ్ వాటర్ కి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడనుంచి వీడే చిత్రం టైపులో హీరో చేసే ప్రయత్నాలే కధాంశం అంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X