Jai HanuMan: జై హనుమాన్‌లో రాముడు మహేష్ బాబు కాదు.. లిస్టులోకి షాకింగ్ స్టార్ హీరో!
చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 20 రోజుల అవుతున్నా కలెక్షన్లు మాత్రం ఆగడం లేదు. 200 కోట్ల మార్కుకు చేరువలో హనుమాన్ ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక జై హనుమాన్ సినిమాలో రాముడు ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మొన్నటివరకు మహేష్ బాబు పేరు వినబడగా.. ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా హనుమాన్. స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి మరీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ మూవీని ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ భాగంలో తెరకెక్కించారు. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో విలన్ గా వినయ్ రాయ్ నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో పోషించారు.

హనుమాన్ సినిమాకు క్లైమాక్స్ లో సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సీక్వెల్ కు పేరును కూడా ప్రకటించారు మేకర్స్. జై హనుమాన్ అంటూ చెప్పగా.. మరి ఆ సినిమాలో రాముడిగా ఎవరు కనిపించనున్నారు.. హనుమాన్ గా ఎవరు కనిపించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా గురించి చెప్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో తేజ పాత్ర చిన్నగా ఉంటుందని.. హనుమాన్, రాముడి పాత్రలు ఉంటాయని తెలిపారు.
దాంతో రాముడు, హనుమాన్ క్యారెక్టర్స్ మీద రోజుకో వార్త బయటకు వస్తునే ఉంది. రాముడిగా ఎవరు కనిపించనున్నారు... హనుమాన్ గా ఏ హీరో కనిపించున్నారు.. ఆనేది ఆసక్తి కలిగిస్తున్న విషయం. మొన్నటి తాజా ఇంటర్వ్యూలో రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు, హనుమంతుడిగా చిరంజీవి చేస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ చెప్పుకువచ్చారు. కానీ అది సాధ్యంకాని విషయం ఎందుకంటే.. మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరి చిరంజీవి ఒప్పుకుంటే కనుక.. హనుమాన్ క్యారెక్టర్ అతనికి సరిగ్గా సూట్ అవుతుంది. అయితే ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. రాముడిగా రామ్ చరణ్ నటించనున్నారని తెలుస్తోంది. దీనికోసం ఆయన ఆడిషన్ కూడా ఇచ్చారట. అయితే రాముడిగా రామ్ చరణ్ పిక్స్ అయితే కనుక.. సౌత్, నార్త్ ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లురి సీతారామారాజుగా రామ్ చరణ్ కనిపించిన సంగతి తెలిసిందే.
ఇక రామారాజు గెటప్ రామ్ చరణ్ ను చూసి నార్త్ అంతా అల్లాడి పోయింది. రాముడిగా కోలిచి.. పూజలు కూడా చేసారు. ఇప్పుడు నిజంగా రాముడిగా కనిపిస్తే మాత్రం తట్టుకోలేరు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ రాముడిగా రామ్ చరణ్ సూట్ అవుతారని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











