twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు కొరటాల మూవీ.. మెగాస్టార్ పాత్రకు ధీటుగా రామ్ చరణ్

    |

    మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. సైరా వంటి చారిత్రత్మక విజయం సాధించిన తరువాత.. కమర్షియల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు చిరు. అందులోనూ ఓ సామాజిక సందేశం ఉండాలని అనుకున్నట్టున్నాడు.. అందుకే ఆ జానర్‌లో దిట్ట అయిన కొరటాల శివతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇంత వరకు అపజయమన్నది ఎరుగని దర్శకుడిగా.. తీసిని ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్‌గా మలిచే టాలెంటెడ్ దర్శకుడు చిరుతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోన్నాడా? అని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురుచూస్తూ ఉన్నారు.

    అట్ట హాసంగా పూజా కార్యక్రమాలు..

    అట్ట హాసంగా పూజా కార్యక్రమాలు..

    చిరు-కొరటాల మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు.. ఎంతో ఘనంగా జరిగాయి. అక్టోబర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలి వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మాత్రం ఆలస్యమవుతూ వచ్చింది. దానికి కారణం..చిరు ఫిట్‌నెస్సే. ఈ మూవీలో మరింత స్లిమ్‌గా కనబడాలని, దాని కోసం కసరత్తులు చేస్తూ వచ్చాడు.

    పాటలతో షూటింగ్ ప్రారంభం..

    పాటలతో షూటింగ్ ప్రారంభం..

    ఈ మూవీ షూటింగ్ జనవరిలో ప్రారంభమైనట్టుగా వార్తలు వచ్చాయి. పాటతో సినిమా షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష ఫిక్స్ అయింది. అయితే ఈ విషయాన్ని మాత్రం నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు.

     మల్టీ స్టారర్ అంటూ ప్రచారం..

    మల్టీ స్టారర్ అంటూ ప్రచారం..

    కొరటాల తెరకెక్కించే ఈ మూవీ మల్టీ స్టారర్ అని ప్రచారం జరగుతూ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తారని రూమర్స్ వినిపించ సాగాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించలేదు. తాజాగా రామ్ చరణ్ పాత్ర తీరు, నిడివికి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చేసింది.

    ఫ్లాష్ బ్యాక్‌లో రామ్ చరణ్..

    ఫ్లాష్ బ్యాక్‌లో రామ్ చరణ్..

    చిరు 152 సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందని, అందులో యంగ్ చిరంజీవి పాత్రను రామ్ చరణ్ పోషిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాకు రామ్ చరణ్ పాత్రే హైలెట్‌గా ఉంటుందని, దాదాపు 25 నిమిషాల పాటు ఆ క్యారెక్టర్ ఉంటుందని టాక్. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అన్నట్టు ఈ చిత్రం టైటిల్ ఆచార్య అని, ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతోందని మరో టాక్ ప్రచారం జరుగుతోంది.

    English summary
    Ram Charan As Young Chiranjeevi In Koratala Siva Movie. This Movie Is Produced By Matinee Enetertainments And Konidela Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X