టీవి 9 యాంకర్ ని ఓ రేంజ్ లో ఆడుకొన్న రామ్ చరణ్..?
వెటకారం చేయడంలో, సెటైర్లు సంధించడంలో చిరంజీవి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అయితే రాజకీయాల్లో కి ప్రవేశించాక చిరంజీవి తన వెటకారాన్ని పూర్తిగా అణిచేసుకుంటున్నారు. కానీ తండ్రి నుంచి ఆ స్పెసాలిటీని పుణికిపుచ్చుకున్న చరణ్ మాత్రం మీడియాతో పరాచికాలు ఆడడానికి సైతం వెనుకాడడం లేదు. రీసెంట్ గా ఓ టాక్ షోటో ఫోన్ లో మాట్లాడిన చరణ్ టీవీ9ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అని అడిగితే నటించడానికి తాము రెడీగా ఉన్నామని, టీవీ9 ప్రొడ్యూస్ చేస్తే వెంటనే కలిసి నటిస్తామని చరణ్ సమాధానమిచ్చాడు. 'మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా, లవ్ మ్యారేజా?" అని అడిగితే 'ఇంకా ఏమీ అనుకోలేదు" అని చరణ్ చెబితే 'ఎవరినైనా ప్రేమిస్తున్నారా" అంటూ టీవీ 9 యాంకర్ రెట్టించింది. 'పోనీ మీరెవరితో అయినా నాకు లింకు పెట్టండి. అదే నిజమై తర్వాత నేను ఆమెని పెళ్లి చేసుకుంటానేమో..మీరు అలా పుట్టించినవి కొన్ని నిజాలయ్యాయి కాబట్టి ఇకపై ఈ పని మీద ఉండండి" అంటూ చరణ్ కౌంటరిచ్చాడు. చరణ్ నుంచి అనూహ్యంగా జరిగిన ఈ ఎటాక్ తో బిత్తరపోయిన టీవీ 9 యాంకర్ కాస్త తత్తరపడి తర్వాత కాసేపటికి తేరుకుంది.
అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అని అడిగితే నటించడానికి తాము రెడీగా ఉన్నామని, టీవీ9 ప్రొడ్యూస్ చేస్తే వెంటనే కలిసి నటిస్తామని చరణ్ సమాధానమిచ్చాడు.


Click it and Unblock the Notifications











