రామ్ చరణ్ బ్యాచులర్ పార్టీ హంగామా

By Srikanya

రామ్ చరణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోవాలో ఈ పార్టీ జరగనుందని సమాచారం. డిసెంబర్ 2 లేదా మూడవ తేదీల్లో ఈ పార్టీ జరగనుంది. ఈ పార్టీకి అల్లు అర్జున్, రానా, శర్వానంద్, నవదీప్ వంటి తెలుగు హీరోలు, మరికొద్ది మంది రామ్ చరణ్ చిన్నప్పటి ప్రెండ్స్ పాల్గొనన్నారు. ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట.

కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్‌ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం. అమితాబ్ ప్రత్యేక అతిధిగా ఈ పంక్షన్ కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X