రాబోయే కాలనికి కాబోయే మెగాస్టార్: రామ్ చరణ్!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ప్రేక్షకులకు పరిచయమవుతూ తొలొ చిత్రంలోనే డ్యాన్సుల్లో, ఫైట్స్ లో 'చిరుత" వేగాన్ని తెరపై చూపిన రామ్ చరణ్ మలి చిత్రం 'మగధీర" తో ఏకంగా ఇండస్ట్రీ హిట్టే కొట్టేశాడు. బాక్సాఫీస్ ని షేక్ చేసేసిన బంపర్ హిట్ ఇచ్చాక కూడా ఎక్సైట్ మెంట్ తో ఎగిరెగిరి పడకుండా, ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా సైలెంట్ గా తదుపరి చిత్రం షూటింగ్ కి వెళ్ళిపోయిన చరణ్ భాస్కర్ తో చేస్తోన్న 'ఆరంజ్" షూటింగ్ జరుగుతుండగానే తదుపరి సినిమా 'మెరుపు"నీ స్టార్ట్ చేయించేసుకున్నాడు.
చూడటానికి చాలా కూల్ గా కనిపించే చరణ్ లో నిజానికి చాలా ఫైర్ వుందనీ, కెరీర్ విషయంలో తను చాలా ప్లాన్డ్ గా ముందుకెళుతున్నాడని అంటున్నారు అతని సన్నిహితులు. హీరోగా తన తండ్రి స్థానాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవాలంటే ఒకటీ, రెండు హిట్స్ తో శాటిస్ ఫై అయిపోకూడదనీ, సినిమా సినిమాకీ ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదనీ, ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ళకూడదనీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయివున్నాడంట చరణ్.
అంతే కాదు ఓ సినిమా చేస్తుండగానే తన తదుపరి నాలుగు చిత్రాల కోసం మినిమమ్ పదిమంది డైరెక్టర్స్ ని ఆప్షన్స్ గా పెట్టుకున్నాడట. ఎవరితో కుదిరితే వాళ్ళతో త్వరగా సినిమా చేయాలి. కొంచెం ఆలస్యం అయినా మిగిలిన డైరెక్టర్స్ తోనూ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రిలాగా తనూ కొద్దిమంది నిర్మాతలకే పరిమితమైపోకుండా అందరికీ అందుబాటులో వుంటానని చెబుతున్నాడు. నిజంగా ఇవన్నీ అమలు చేస్తే ఖచ్చితంగా నెక్ట్స్ మెగాస్టార్ రామ్ చరణే అంటున్నారు పరిశీలకులు కూడా. మొత్తానికి బావ మీద ఆధారపడ్డ తండ్రిలా, బద్దకించిన బాబాయ్ లా కాకుండా 'మెరుపు" వేగాన్ని చూపిస్తూ అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడీ ఫ్యూఛర్ మెగాస్టార్!


Click it and Unblock the Notifications











