బహుభాషా నటుడిగా అనిపించుకోవాలనుకొంటున్నా ‘మగధీర’!
రామ్ చరణ్ కు మగధీర తెచ్చిన విజయం అంతా ఇంతా కాదు. హిందీ, తమిళ నటులు ఈ చిత్రాన్ని చూసి దర్శకుడి ప్రతిభను హీరో నటనను కొనియాడారు. విక్రమ్ అయితే ఏకంగా ప్రత్యేకంగా షో వేయించుకుని మరీ 'మగధీర" చూశాడు. చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించిన రాజమౌళి డైరెక్షన్ లో నటించాలన్న కోరికను వ్యక్తం చేశాడు కూడా. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ఇందులో హృతిక్ రోషన్ నటించే అవకాశాలున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తమిళ రీమేక్ హక్కుల కోసం తమిళ తంబీలు పోటీ పడ్డారు. అజిత్ తమిళ మగధీరగా నటిస్తున్నాడంటూ వర్తలొచ్చాయి. చివరికి రైట్స్ ను ఎవరికి అమ్మలేదని తెలిసింది. మగధీరను తమిళంలోకి డబ్బింగ్ చేయండం ద్వారా రామ్ చరణ్ ను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నారు. తమిళ మగధీరను సంక్రాంతి పండుగ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మగధీర తమిళ డబ్బింగ్ ద్వారా చరణ్ ను కోలీవుడ్ కి పరిచయం చేయడమే కాదు, హీరో మార్కెట్ ను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రామ్ చరణ్ టిస్తున్న తాజా చిత్రం'ఆరంజ్"ని తెలుగుతో పాటు తమిళంలో కూడా నిర్మిస్తున్నారు. దీనికి దర్శకత్వం నిర్వహిస్తున్న భాస్కర్ తమిళియన్ కావడం హీరోయిన్లుగా నటిస్తున్న జెనీలియా, శృతిహాసన్ కు తమిళ మార్కెట్ ఉండడం, ఆరంజ్ చిత్రానికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు.
అటు తమిళ హీరోగా కూడా ఇమేజ్ తెచ్చుకునే క్రమంలో రామ్ చరణ్ నటించే నాలుగో చిత్రం కు తమిళ దర్శకుడు ధరణిని దర్శకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. ధరణి గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'బంగారం" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినా తమిళంలో బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రస్తుతం కథను తయారు చేసే పనిలో ధరణి ఉన్నాడట! ఆరంజ్ షూటింగ్ పూర్తికాగానే ద్విభాషా చిత్రంగా ధరణి సినిమా తెరపైకి రానుంది.
విక్రమ్, సూర్య నటించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై ఇక్కడా విజయం సాధించడంతో తెలుగులో మార్కెట్ పెంచుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ కూడా వీరి బాటలో నడిచి బహుభాషా నటుడు అనిపించుకోవాలనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











