రామ్ చరణ్ నిజంగానే 'గూగుల్ స్టార్'!??

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో గూగుల్ స్టార్ అంటూ టైటిల్ సాంగ్ లో ఓ పదం వస్తుంది. ఆ పదం చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ నిజంగా నిజజీవితంలో గూగుల్ స్టార్ అయ్యాడంటూ వార్తలు వినవస్తున్నాయి. గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పదం రామ్ చరణ్ కాబట్టి గూగుల్ స్టార్ అయ్యాడంటున్నారు. అదేంటి హటాత్తుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సౌతిండియన్ యంగ్ హీరో గూగుల్ స్టార్ అవటమేంటి అంటే...జంజీర్ చిత్రంలో చేయటంతో ఎవరీ రామ్ చరణ్ అని దేశమంతటా అతని పేరుని గూగుల్ లో సెర్చ్ చేసారు. కాబట్టి గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తి ఈ మధ్య కాలంలో కాబట్టి గూగుల్ స్టార్ అంటున్నామని చెప్తున్నారు.

ఇక ప్రియాంక చోప్రా సరసన నటించటం,అమితాబ్ ప్రత్యేకంగా రామ్ చరణ్ గురించి ప్రస్దావించటం,సల్మాన్ ఖాన్ వంటివారితో పార్టీలుకు హాజరవటంతో ఈ తెలుగు స్టార్ హఠాత్తుగా నార్త్ ఇండియాలో సెర్చింగ్ స్టార్ గా మారిపోయారు. అతన్ని గూగుల్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. అమితాబ్ జంజీర్ రీమేక్ లో చేస్తున్న కుర్రాడు ఎలా ఉన్నాడు..అతను ఆ క్యారెక్టర్ కి సరిపోతాడా...ఏంటి అతని గొప్పతనం అన్నట్లుగా వారు సెర్చ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక ఇది నిజమైతే మెగా క్యాంప్ ఈ సినిమా ఎన్నుకోవటం కరెక్టే అంటున్నారు. జంజీర్ ని ఎన్నుకుంటే చాలు ఊహించని క్రేజ్ దానంతట అదే వస్తుందనే వారి అంచనా నిజమైందని అంటున్నారు.

అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా చేయనున్నారు. అగ్నిపధ్ లో సంజయ్ దత్ అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు.

1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X