అదే రామ్ చరణ్ వ్యూహం!?
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ ల కాంబినేషన్లో రానున్న చిత్రం ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభం కానుంది. మగధీర జూలైలో రిలీజ్ కి ప్లాన్ చేస్తూండటంతో ఈ చిత్రాన్ని ఫైనలైజ్ చేసారు. అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫైనలైజ్ చేయటం వెనక మంచి స్టేటజీ ఉందని సినీ మేధావులు అంటున్నారు. రాజమౌళి సినిమా మగధీర ఇచ్చే ఇమేజ్ కి భిన్నంగా ఈ సినిమా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. భాస్కర్ దర్శకత్వంలో చేయటం వల్ల నటుడుగా ఎలివేట్ అవుతాడని భావిస్తున్నారు. అప్పుడు అల్లు అర్జున్ దేశముదురు సూపర్ హిట్ అనంతరం కూడా పరుగు చిత్రాన్ని తీసి అతని కెరీర్ ని బ్యాలన్స్ చేసారంటున్నారు. దాంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ముద్ర పడకుండా చూడవచ్చని, ప్రేక్షకులు ధియోటర్ కి వచ్చేటప్పుడు ఫలానా ఇమేజ్ అని ఫిక్స్ అయి రాకుండా ఉండే వీలుండమే ఈ స్ట్రాటజీ అంటున్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎక్కువ భాగం అమెరికాలో జరగనుంది. అలాగే ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తూంటే జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











