రామ్ చరణ్‌తో కిల్లింగ్ డైరెక్టర్ మూవీ ఫిక్స్? అలా చూపిస్తే థియేటర్లు బద్దలే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత వచ్చిన ఈ చిత్రం ఆ సినిమా రేంజ్ లో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయినా.. మంచి కథతో రామ్ చరణ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ పాత్రల్లో జీవించారు. పొలిటికల్ డ్రామాలో చరణ్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. కానీ ఎందుకు ఈ సినిమా పెద్దగా సెన్సేషన్ కాలేకపోయింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్లను మాత్రం సాధించింది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చరణ్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే అందరి చూపు ఉంది. ఎలాగైనా రామ్ చరణ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసేలా అప్ కమింగ్ ఫిల్మ్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే 'ఉప్పన'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబుతో ఆర్సీ16 చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. స్పోర్ట్ డ్రామాతో బిగ్ స్కేల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. గేమ్ ఛేంజర్ పనుల తర్వాత రామ్ చరణ్ రీసెంట్ గానే ఆర్సీ16 సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈచిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ పై అభిమానులు , ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఒకటి వచ్చేసింది.

రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేశారని తెలుస్తోంది. గతేడాది 'కిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ సెన్సేషన్ గా మారారు. రన్నింగ్ ట్రైయిన్ లో ఎన్ఎస్జీ కమాండో దోపిడీ దొంగలను ఎలా ఎదుర్కొన్నడనే కథతో ఆడియెన్స్ కు కొత్త ఫీలింగ్ ను అందించారు. కొత్త హీరోతో నిఖిల్ చేసిన 'కిల్' ట్రైయిన్ యాక్షన్ సీన్లు ఆడియెన్స్ మైండ్స్ ను ఇప్పటికీ డ్రిల్ చేస్తున్నాయి. ఎక్కడా ఎమోషన్ తప్పకుండా కథను నడిపించిన తీరు, వెన్నులో వణుకుపుట్టించే ఫైట్ సీన్లతో సంచలనం క్రియేట్ చేశారు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో నిఖిల్ నగేష్ భట్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారాయి. 'కిల్' తరహాలోనే రామ్ చరణ్ తో యాక్షన్ చిత్రాన్ని గనుక తెరకెక్కిస్తే థియేటర్లు మాత్రం బద్దలవ్వాల్సిందే అంటున్నారు. మరోవైపు పౌరాణిక ఇతిహాసంపై ఫోకస్ చేశారని కూడా అంటున్నారు. గత ఆరు నెలలుగా చర్చలు కొనసాగుతున్నాయని టాక్. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం లేదు. కానీ త్వరలోనే కన్ఫమ్ చేస్తారని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. అన్ని కుదిరాక బుచ్చిబాబు సినిమా తర్వాతనే ఆర్సీ18గా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. నిర్మాత మధు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. దీంతో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ తర్వాత సుకుమార్‌తో మరోసారి చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











