సానియామీర్జా కాపురంలో రామ్ చరణ్ చిచ్చు??
హైదరాబాద్ : గత రెండు,మూడు రోజులుగా మీడియాలో, అంతర్జాలంలో ఇదే చర్చనీయాంసంగా మారింది. ఈ రూమర్ ఎవరు క్రియేట్ చేసారో కానీ గాలి కంటే వేగంగా సోషల్ మీడియాలో ప్రయాణిస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ ఉండే సానియా మీర్జా, సోయబ్ మాలిక్ లు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మధ్యా ఏవో మనస్పర్దలు చోటు చేసుకున్నాయని, విడిపోవాలనుకుంటన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దానికి తోడు ఈ మధ్యన డిల్లీలో సానియా, కరాచీలో సోయబ్ విడివిడిగా పార్టీలు ఇచ్చి ఎంజాయ్ చేసారట. ఇద్దరు కలిసి ఈ మధ్యన కనిపించలేదని అంటున్నారు. వీరి కాపురం గొడవ ఇలా ఉంటే వీరు ఇలా విడిపోవటానికి కారణం రామ్ చరణ్ అంటూ మీడియాలో హల్ చల్ చేయటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దాంతో మెగాభిమానులు ఈ వార్తలపై మండిపడుతున్నారు.

రామ్ చరణ్, సానియా మీర్జా ఈ మధ్యన కొన్ని పార్టీల్లో కనిపించటం చర్చనీయాంసమైపోయింది. ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉండటం కూడా ఈ వార్త బలపడటానికి కలిసి వచ్చింది. మరో ప్రక్కన రామ్ చరణ్ తాజా చిత్రంలో సానియా మీర్జా ని గెస్ట్ గా అడిగారని, దానికి ఆమె సై అందని కూడా చెప్తున్నారు. అయితే నిజానిజాలు తెలియకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచింది.
ఇక రామ్ చరణ్ తాజా చిత్రం విషయానికి వస్తే..

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.


Click it and Unblock the Notifications











