‘తడాఖా’ బాలీవుడ్ రీమేక్‌లో రామ్ చరణ్?
బాలీవుడ్ వెర్షన్లో నాగ చైతన్య పాత్రకు షాహిద్ కపూర్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఇంకా ఈ విషయం ఫైనల్ కాలేదని అంటున్నారు. నాగ చైతన్య పాత్రకు రామ్ చరణ్‌ను తీసుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జంజీర్ సినిమాలో రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు చేయడంతో కరణ్ జోహార్ దృష్టి రామ్ చరణ్‌పై పడినట్లు బాలీవుడ్ టాక్.
ఇటీవల కరణ్ జోహార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు 'జంజీర్' స్పెషల్ షో చూసారని, ఈ సినిమా చూసి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌ను అంతా మెచ్చుకున్నారని తెలుస్తోంది. కరణ్ జోహార్ వెంటనే రామ్ చరణ్‌కు ఫోన్ చేసి అభినందించాడని కొందరంటున్నారు. తడాఖా రీమేక్ ప్రస్తావన కూడా ఆయన తెచ్చినట్లు తెలుస్తోంది.
అయితే రామ్ చరణ్ తన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని, ఆ సినిమా ఫలితాలను విశ్లేషించిన తర్వాతే బాలీవుడ్లో చేసే రెండో ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications
