రామ్ చరణ్ ఆటకూలీనా? బుచ్చిబాబు క్రియేట్ చేసిన వరల్డ్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' ఎంత పెద్ద చిత్రాల్లో నటిస్తున్నారో తెలిసిందే. రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం ఆర్సీ16. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టును బ్లాక్ బస్టర్ ఫిలిం ఉప్పెన చిత్రం డైరెక్టర్ బుచ్చిబాబు డీల్ చేస్తున్న విషయం కూడా విధితమే. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. రామ్ చరణ్ నుంచి చివరిగా వచ్చిన 'గేమ్ చేంజర్' ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నప్పటికీ... బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆ చిత్రం ఘోర పరాజయం పొందింది. దాంతో రామ్ చరణ్ అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. ఇక నెక్స్ట్ సినిమాతో అయినా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఆర్ర్సీ16 వర్క్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ మాత్రం చక చకా నడుస్తుంది. దీంతో ఈ సినిమా స్టోరీ ఏంటీ? రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? బుచ్చిబాబు ఎలాంటి ప్రపంచాన్ని చూపించబోతున్నారు? అనే ప్రశ్నలు మెగా అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లోనూ ఉత్పన్నమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Ram Charan Buchi babu RC16 Movie Story Line

రామ్ చరణ్ తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుందంటూ ఇప్పటికే ప్రచారం జరిగింది. ఇక చిత్రంలో భారీ తారాగణం కూడా ఉండడం సినిమాపై మరింత హైప్ ను పెంచేస్తోంది. తాజాగా అందిన అప్డేట్ తో మాత్రం మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అథ్లెట్ గా కనిపించబోతున్నారు. ఇందుకోసం బుచ్చిబాబు ఓ వరల్డ్ ను క్రియేట్ చేశారంట. సూపర్ అథ్లెట్ గా కనిపించబోతున్న రామ్ చరణ్ ఆటకూలీగా అలరించబోతున్నారంట. ఇక్కడ ఆటకూలి అంటే ఏంటా అని సందేస్తున్నారా? దానికి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.

ఆర్సీ16 లో పలు రకాల ఆటలను బుచ్చిబాబు చూపించబోతున్నారు. అయితే ఆటలకు సంబంధించిన నిర్వాహకులు ఒక మేనేజ్మెంట్ గా ఏర్పడి, క్రీడాకారులను కొనుగోలు చేస్తూ ఉంటారంట. అలా కొనుగోలు చేసిన ఆటగాలన్నే ఆట కూలీలుగా పిలుస్తారంటూ ప్రచారం. ఆ ఆట కూలీలతో నిర్వాహకులు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించి గెలుపోటములకు సరికొత్త నిర్వచనాన్ని కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో బుచ్చిబాబు కుస్తీ, కబడ్డీ, రగ్బీ వంటి ఆటలను చూపించబోతున్నారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉన్నదనేది మరికొద్ది రోజులు ఆగి చూడాల్సిందే.

ప్రస్తుతం మాత్రం బుచ్చిబాబు కబడ్డీ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అతిలోకసుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండడం విశేషం. రీసెంట్ గానే ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం రామ్ చరణ్ కు కోచ్ పాత్రలో అలరించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు స్టార్ క్రికెటర్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని కూడా కామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లలో ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Take a Poll

More from Filmibeat

Read more about: ram charan buchi babu rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X