Don't Miss!
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లెసెన్స్’ కొన్నాడట.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఓ భాషలో సినిమా విడుదలై మంచి ప్రేక్షకాదరణ లభిస్తే.. ఇతర భాషల వారు కన్నెయడం సహజమే. రీమేక్‌ల పేరిట ఆ చిత్ర హక్కులను చేజిక్కించుకుని తమ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఆ రీమేక్‌ల చిట్టా తీస్తే.. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్, ఇండస్ట్రి హిట్స్ కొట్టిన చిత్రాలున్నాయని. అయితే ఆ జాబితాలోకి చేరేందుకు మరో చిత్రం కూడా రాబోతోంది. అదే డ్రైవింగ్ లైసెన్స్.
ఈ మధ్య మలయాళంలో ఓ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆ మూవీ గురించే టాక్ వినపడుతోంది. వైవిధ్యభరితమైన చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు, హీరో అయిన పృథ్వీరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడట.

రామ్ చరణ్ ఈ రీమేక్‌ను తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించనున్నాడని టాక్. అయితే ఇది వేరే హీరోలు ఎవరితో అయినా నిర్మిస్తాడా? లేదా మెగా హీరోల్లోనే ఎవరితోనైనా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పృథ్వీరాజ్ నుంచి లూసిఫర్ హక్కులను కూడా కొన్నాడు. చిరు 153వ చిత్రంగా లూసిఫర్ రీమేక్ తెరకెక్కబోతోందని, ఈ మూవీ స్క్రిప్ట్ పనులను సుకుమార్ చూసుకుంటున్నాడని టాక్.